ఓటమికి ఆదిత్యనాథ్ చెప్పిన కారణాలు

Updated By ManamWed, 03/14/2018 - 18:19
yogi adityanath

yogi adityanathలక్నో : యూపీ బైపోల్స్‌లో బీజేపీ ఓటమిని అంగీకరించారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పిన ఆయన...గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గాల బైపోల్స్‌లో గెలుపొందిన సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. అతి విశ్వాసం కారణంగానే తమ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. అలాగే చివరి నిమిషంలో మారిన రాజకీయ సమీకరణలు తమ పార్టీ ఓటమికి మరో కారణమని విశ్లేషించారు. చివరి నిమిషంలో ఇరు పార్టీల మధ్య ఏర్పడిన పొత్తు ప్రభావాన్ని అంచనావేయడంలో తాము విఫలం చెందామన్నారు. చివరి నిమిషంలో బీఎస్పీ - సమాజ్‌వాది పార్టీ మధ్య పొత్తు ఏర్పడడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో సమాజ్‌వాది పార్టీ-బీఎస్పీపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయ వ్యాపారం దేశాభివృద్ధికి అవరోధమని వ్యాఖ్యానించారు. ఈ కూటమిని అడ్డుకునేందుకు తగిన వ్యూహాలను రచిస్తామని చెప్పారు.

Read related article: బీజేపీపై ప్రజలు కోపంతో ఉన్నారు

యూపీలోని గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ లోక్‌‌సభ నియోజకవర్గాలకు జరిగిన బైపోల్స్‌లో సమాజ్‌వాది పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బీఎస్పీ మద్దతుతో పోటీ చేసిన సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఫలితాలతో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ను ప్రజలు తిరస్కరించారని సమాజ్‌వాది పార్టీ అధికార ప్రతినిధి అనురాగ్ బౌదౌరియా పేర్కొన్నారు. 

English Title
Overconfidence, changed political equation behind BJP's loss in Gorakhpur, Phulpur Lok Sabha bypolls
Related News