అధికారికం: ‘పద్మావత్’ విడుదల తేదీ ఖరారు

Updated By ManamSun, 01/14/2018 - 18:36
padmavat

padmavatఎన్నో వివాదాలు, మరెన్నో బెదిరింపులు. అన్ని అడ్డంగులను అధిగమించి ‘పద్మావత్’ ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 25న విడుదలకానుంది. ఈ మేరకు ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయం నుంచే పలు వివాదాలు రాజుకున్నాయి. గత ఏడాది డిసెంబరు 1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు తొలుత భావించారు. అయితే ఈ చిత్రాన్ని పలు రాష్ట్రాల్లో నిషేధించడం, కర్ణిసేన బెదిరింపులు, సెన్సార్ బోర్డు క్లియరెన్స్ లభించకపోవడం సినిమా విడుదలను వాయిదావేశారు. దీపిక పదుకొనె, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీని చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వెలువడ్డాయి. 

Read Related Article: ‘పద్మావత్’కు మరో గుడ్‌న్యూస్

ఇటీవల ఈ చిత్రాన్ని U|A సర్టిఫికేట్ ఇస్తున్నట్లు ప్రకటించిన సెన్సార్ బోర్డు...సినిమా టైటిల్‌ను ‘పద్మావత్’గా మార్చడంతో పాటు మరికొన్ని మార్పులు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు టైటిల్ మార్చడంతో పాటు మిగిలిన మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో పద్మావత్ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు వయాకామ్18 గ్రూప్ సీఈవో సుదాంషు వత్స్ ప్రకటించారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రభుత్వ యంత్రాంగం, సెన్సార్ బోర్డు, సినీ వర్గాల నుంచి ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణ పట్ల ధన్యవాదాలు తెలిపారు. భారత దేశ విలువలను చాటేదిగా పద్మావత్ చిత్రం ఉంటుందని చెప్పారు. ప్రతి భారతీయుడు గర్వించేలా ఈ చిత్రం ఉంటుందని వ్యాఖ్యానించారు. 

English Title
Padmaavat finally gets official release date


Related News