పాక్‌లో ఉగ్రదాడి.. 20మంది మృతి

Updated By ManamWed, 07/25/2018 - 12:45
pakistan

bomb blast కరాచీ: సార్వత్రిక ఎన్నికల వేళ పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బలోచిస్థాన్ రాజధాని క్వెట్టాలో ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 20మంది మరణించగా, 40మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిపినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మరోవైపు కైబర్ పక్తున్‌ఖ్వాలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ, అమీ నేషనల్ పార్టీ మద్దతుదారుల మధ్య జరిగిన గొడవలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

English Title
Pakistan election: 15 dead in bomb attack as voting ongoing
Related News