‘కొడకండ్ల సిద్ధాంతి’ శివైక్యం

Updated By ManamThu, 08/09/2018 - 12:51
Palakurthi Nrusimha Rama Sharma Passes away

Palakurthi Nrusimha Rama Sharma Passes away

హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహ రామ సిద్ధాంతి (కొడకండ్ల సిద్ధాంతి) (94) శివైక్యం చెందారు. గురువారం ఉదయం పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల గ్రామంలోని ఆయన తుదిశ్వాస విడిచారు. సిద్ధాంతిగా ఈయన దశాబ్దాల పాటు సేవలందించారు. వరంగల్ జిల్లాలోని కొడకండ్ల ఆయన స్వగ్రామం కాగా.. 'కొడకండ్ల సిద్ధాంతి'గా తెలుగు రాష్ట్రాల్లో మంచిపేరు సంపాదించుకున్నారు. బహుశా ఈయన పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరేమో.!. గత కొద్దిరోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం కన్నమూశారు. 

అర్చక పౌరహిత్యంతో ఆయన ఎంతో మందికి ఉపాధి కల్పించారు. కాశీ, ఉజ్జయిని లాంటి క్షేత్రాల్లో వేలాది చండీయాగాలను నిర్వహించిన సోమయాజి. ఎలాంటి ప్రచారాన్ని ఆశించకుండా నిరాండంబర జీవితాన్ని నృసింహరామ గడిపారు. 55 సంవత్సరాలుగా పంచాంగ రచన చేశారు. 70 సంవత్సరాలుగా దేవీనవరాత్రులు నిర్వహించారు. ఉగాది పురస్కారంతో పాటు మరెన్నో సన్మానాలు, సత్కారాలు ఆయనకు అందాయి. ఎందరో పీఠాధిపతులు, మఠాధిపతులతో ఆయనకు సాన్నిహిత్యం కలిగి ఉన్నారు.

ఈయనకు గతంలో రవీంద్ర భారతిలో జరిగిన ఓ  కార్యక్రమంలో 'ధార్మిక వరేణ్య' బిరుదు కూడా పొందారు. ఈ బిరుదును సీఎం కేసీఆర్.. ఆయనకు స్వర్ణ కంకణాన్ని తొడిగారు. అనంతరం ఆయన కూర్చున్న పల్లకీలో ఉంచి కేసీఆరే స్వయంగా మోశారు. సీఎం కేసీఆర్ గతంలో తలపెట్టిన అయుత చండీయాగం కూడా కొడకండ్ల సిద్ధాంతి చేతుల మీదుగానే జరిగింది.

సిద్ధాంతి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
1925 జూలై 20న జన్మించిన నృసింగరామ సిద్ధాంతికి మొదటి నుంచీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండేది. ఆయనకు తెలుగు, హిందీ, సంస్కతం భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఆయన ఇప్పటి వరకు 2400 ఆలయాల ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించడమే కాక, బొండ్రాయి ప్రతిష్ఠాపనతో సహా అనేక విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనకు వైదిక విద్య, జ్యోతిష్యాలతో కూడా ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం ఆయన కొంత కాలంగా ధర్మ ప్రచారం, ఆధ్యాత్మిక సేవలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన భార్య సుభద్రాదేవి మూడేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. 

ఆయనకు ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడైన గౌతమి శర్మ బయోమెడికల్ కంపెనీ ఉద్యోగం వదులుకొని తన వెంట ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటున్నారు. నిత్యపారాయణ పద్ధతి, శ్రీ విద్య సాఫల్య, శ్రీ విద్య లఘుచక్రపూజ, శ్రీ విద్య నిత్యాహ్నికం, రుద్ర స్వాహాకారం గ్రంథాలను రచించిన నృసింహ రామ సిద్ధాంతి రాష్ట్రంలోనే కాక, ఉజ్జయని, కాశీ, వేలు ప్రాంతాల్లో నవచండీ హోమం నిర్వహించారు. దీపావళి, దసరా ఇతర పండుగ తేదీల్లో వ్యత్యాసం వస్తుండటంతో ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేసిన ఏకైక సిద్ధాంతి ఈయనే.

English Title
Palakurthi Nrusimha Rama Sharma Passes away
Related News