పాలమూరు జలగోస

Updated By ManamWed, 10/24/2018 - 00:59
Palamuru

imageపాలమూరు అధ్యయన వేదిక, తెరాస ప్రభుత్వ పు ణ్యమా అని నాలుగు పాయలుగా విభజించబడింది. విభజింపబడ్డ నాలుగు పాయలూ ఉమ్మడిగానే పని చేస్తున్నవి. అధ్యయన వేదిక అంతకుముందు పని చేసిన కరువు వ్యతిరేక పోరాట కమిటీ, అతి వెనుక బడ్డ జిల్లా ప్రజల కరువును ఏకరువు పెట్టింది, కరువు మూలాలకు వెళ్లే ప్రయత్నం చేసింది. ప్రజలలో పని చేసే క్రమంలోనే తన అధ్యయనాన్ని, తన చైతనాన్ని, తన పట్టుదలను పెంచుకుంటూ సభ్యులు తమ తమ శక్తి మేరకు ఆయా ప్రాంతాల్లో కృషి చేస్తున్నారు. నిజా నికి పాలమూరు లాంటి వెనకబడిన జిల్లాల ఉద్యమ స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షగా రూపాంతరం చెం దింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సాగు నీరు, తాగునీరు అనే సమస్యలు నిరంతరంగా ప్రవ హించడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒక ప్రవా హంగా మారింది. తెలంగాణ వెనుకబాటు తనానికి పాలమూరు ఒక ఉదాహరణగా, ఒక బలమైన వాద నగా ఒక సాక్ష్యంగా ఉపయోగపడింది. ఆంధ్ర ప్రాం తంలో పెట్టుబడుదారులు వేసే ప్రశ్నలకు పాలమూరు ఒక దీటైన జవాబుగా మారి చాలామంది నోళ్ళను మూయించింది. ముందు ఎన్నడూ లేనంత తీవ్రంగా ఈ సమస్య తెలంగాణ ప్రధాన స్రవంతి ఉద్యమంలో భాగమై పోయింది. మునుపెన్నడూ లేనివిధంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాలమూరు వల సల గురించి మాట్లాడడం, సాహిత్య రచనలు రావ డం, కరువు కవిత్వీకరింపబడి పాటలుగా ప్రజలను కంటతడి పెట్టించింది. ఉద్యమ ఆకాంక్ష సాకారమై ఎప్పుడొస్తుందోనన్న రాష్ట్రం రానే వచ్చింది. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రెండు ప్రవా హాలుగా సాగింది. ఒకటి - భౌగోళిక తెలంగాణ, రెం డు - ప్రజాస్వామికimage తెలంగాణ. ప్రజాస్వామ్య తెలం గాణ రావాలన్నా భౌగోళిక తెలంగాణ ఏర్పడకుండా సాధ్యం కాదు అనే వాదన బలంగానే ముందుకు వ చ్చింది. భౌగోళిక తెలంగాణ డిమాండ్ ప్రధాన రాజ కీయ పార్టీల చేతిలో పడింది. జయశంకర్‌లాంటి ప్ర జాస్వామ్యవాదులు తెలంగాణ అంటూ ఏర్పడితే ఈ ప్రాంత నాయకులే అధికారంలోకి వస్తారు కాబట్టి, ప్రాంతం దాటి పోలేరు, కాబట్టి ప్రాంత ప్రజలకు ప్రాంత సమస్యలకు జవాబుదారీగా ఉంటారని బలం గా భావించారు. ఆ విషయం ఆయన పలు సందర్భా లలో నాతో వ్యక్తిగతంగా వాదించాడు. ప్రాంతం వా ళ్ళ చేతిలో అధికారం వచ్చినంత మాత్రాన ఈ ప్రాం త అట్టడుగు ప్రజలకు అత్యంత వెనకబడిన జిల్లాలకు అధికారం వస్తుందని భావించడం సరి యైంది కాదని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం ఏం పట్టలేదు. ప్రాంత ప్రయోజనాలలో వైవిధ్యముంది, వైరుధ్య ముంది. తెలంగాణలో సాపేక్షికంగా కోస్తా అభివృద్ధి చెందిన జిల్లాల గోస వినపడినట్లు అత్యంత వెనకబ డిన పాలమూరు, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల గో స వినబడలేదు. భౌతికంగా అభివృద్ధి చెందని ప్రాంత నాయకత్వం కూడా అంటే వెనకబడి ఉంటుంది. తమ జిల్లా సమస్యలను అత్యంత ప్రాధాన్యాలుగా తీసుకొని అధికారంలో ఉండే వాళ్ళతో కలబడరు. తమ ప్రయో జనాలు తీరితే అంతకే సంతృప్తి చెందుతారు.

 శ్రీశైలం ముంపుగ్రామ బాధితులు ఎన్ని రకాలుగా పోరాడినా, అధ్యయన వేదికతో బాటు ప్రజాసంఘాలు మద్దతు ఇచ్చినా అంత చిన్న సమస్యను పరిష్కరింపలేక పో యాం. పరిష్కారం ఏదైనా దొరికే క్రమంలో జిల్లా మంత్రులే అడ్డంపడుతున్నారని బాధ్యత గల పదవు ల్లో ఉన్నవాళ్లే మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందు కో పాలమూరు జిల్లా నాయకులకు ప్రజల సమస్యలు పరిష్కారించి ప్రజల మన్నన ద్వారా ఎన్నికలలో గెల వాలని కాక, మాకు కాక ఇంకెవరికి ఓటు వేస్తారన్న ధీమా చాలామందికి ఉంది. జిల్లా ప్రజలు కూడా అది వాళ్ల వెనకబాటుతనం వల్లే కావచ్చు ఎన్నికలలో ఓ టింగ్ సరళి కూడా అలాగే ఉంటున్నది. ఇలాంటి స్థితి లో పౌరసమాజంలో భాగమైన ప్రజాసంఘాలు రాజ కీయ అవగాహనతో పనిచేయవలసి ఉంటుంది. ఈ సంఘాలకు వ్యక్తిగత ప్రయోజనాలు తక్కువ. అధికా రం కావాలని లేదా పదవులు కావాలనే కోరిక లేకపో వడం వలన ప్రజలలో వాళ్ళ సాధికారత (క్రెడిన్షియా లిటీ) చాలా ఎక్కువ. ఈ సంఘాలు ప్రజల చైతన్య స్థాయిని పెంచే పాత్ర నిర్వహిస్తుంటాయి. వెనకబాటు తనం పోవాలంటే రెండే మార్గాలు భౌతిక వనరుల పెంపుదల; రెండు, చైతన్య స్థాయి పెరగడం. భౌతికం గా వెనకబడిన ప్రాంత ప్రజల సమస్యలు చైతన్యం పెరగడం వల్లే పరిష్కారమౌతాయి. ఇప్పుడు దేశం అ వలంభిస్తున్న అభివృద్ధి నమూనాను నియంత్రించడా నికి ప్రజా చైతన్యం పాత్ర చారిత్రక అవసరమై పో యింది. గత రెండు దశాబ్దాలుగా అధ్యయన వేదిక అనుభవమే ఒక పాఠం. మొదట మొదట నీళ్లెక్కడి నుంచి వస్తవి అన్న రాజకీయ నాయకులు కూడా లేకపోలేదు. పామూరు అధ్యయన వేదిక కృషి, నిజా యితీ గలిగి ప్రజల పక్షాన ఆలోచించిన పాలమూరు ఇంజనీర్ల కృషివల్ల పాలమూరు రంగారెడ్డి నీటి పథ కం ఒకరూపు దిద్దుకున్నది. ఒక రెండు మూడు దశా బ్దాల క్రితం ఎవరైనా ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడితే అది అసాధ్యం అన్న దగ్గరి నుంచి అది ఒక నిజమైన కలగా మారింది. కిరణ్‌కుమార్ రెడ్డి దీని సాధ్యాసా ధ్యాల కొరకు ఆదేశించినప్పుడే ఇది ప్రాణం పోసు కుంది. ఇది పౌరసమాజం సాధించిన విజయం. పాల మూరు రంగారెడ్డి నీటి పథకంతో పాటు పాలమూరు జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులలో కదలిక మొద లైంది, చెరువులు కుంటల పునరుద్ధరణ మొదలైంది. జిలాలలో పర్యటిస్తే ఏదో పనులు జరుగుతూనే ఉన్నా యి. ఈ కదలిక గమనించవలసినదే? ఇది ప్రజలు సాధించుకున్న విజయంగానే భావించవలసి ఉంటుం ది. అధ్యయన వేదిక సభ్యులకు కూడా ఇదొక గర్వకా రణం. 

పనులు ప్రారంభమయ్యాయి, డిజైన్లు తయారై వాటి అమలు ప్రారంభం కావడంలోనే ప్రాజెక్టులు తప్పుదారి పడుతున్నట్లు అధ్యయన వేదిక పసికట్టిం ది. పాలమూరు ఇంజనీయర్లు దీనిని ధ్రువీకరించారు. ప్రాజెక్టులు డిమాండ్ చేసి సాధించుకోవడమే కాదు, వాటిని ఎలా అమలు పరచుకోవాలో, ప్రాజెక్టుల డిజై న్లు ఎలా వేస్తే అత్యంత ప్రయోజనకరంగా ఉంటా యో ప్రజలే చెప్పే స్థితి రావడం సాధారణమైన ప్రగతి కాదు. ఉదాహరణకు పాలమూరు రంగారెడ్డి పథకం డిజైన్‌ను ప్రభుత్వం మార్చింది. సాధారణంగా ఇది సాంకేతిక అంశం అని ప్రజలు వదిలిపెట్టలేదు. ఈ ప్రాజెక్టును రెండు దశలుగా విభజించాలని, ఒక దశ లో జూరాల నుంచి ఒక ప్రాంతానికి, అలాగే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మరో దశలో ఇతర ప్రాంతాలకు నీరందేట్టు ప్రాజెక్టులు చేపట్టాలని వాదించారు. శ్రీశై లం బ్యాక్‌వాటర్ వాటర్ నుంచి నారాయణ పేట దాకా ఎత్తిపోయడం అసమంజసమని, అసాధ్యమని వాదిస్తూ, క్రిందికి పారుతున్న కృష్ణా నీళ్ళ వరద జలా లను మధ్యనే తోడుకోవచ్చని, నీళ్ళన్నీ కిందకు పోయాక మళ్ళీ వాటిని వెనక్కి తీసుకురావడం అశాస్త్రీ యమనే వాదన బలంగా ముందుకు వచ్చింది. మన దేశంలో ప్రాజెక్టు డిజైన్లు కేవలం ఇంనీయర్లే చేయరు, మధ్యన కాంట్రాక్టు ముఠా ఒకటి బలంగా తయా రైంది. ఈ ముఠాకి రాజకీయాలకు విప్పలేని ముడి పడింది. నీళ్ళు ఎక్కడ ఆపవచ్చు, ప్రాజెక్టు ఎలా సాధ్యమో నిపుణులు చెబుతారు. ఇందులో సాంకేతిక జ్ఞానం ఉంటుంది. ప్రజలు నీళ్లను ఎక్కడ ఆపవచ్చో జీవిత అనుభవం నుంచి చెబుతారు. అనుభవం కూ డా చాలా విలువైన జ్ఞానమే. కాంట్రాక్టర్లు నీళ్ళను ఎ లా మళ్లిస్తే తమ ప్రయోజనాలు ముఖ్యంగా అంతులే ని లాభాలు (కమీషన్లు) ఎలా వస్తాయోనని ఆలోచి స్తారు. ఈ ముఠా వల్ల దేశవ్యాప్తంగా ప్రాజెక్టు డిజైన్లు మార్చడం వల్ల ప్రతి నీటి ప్రాజెక్టు సమస్యాత్మకంగా మారింది. ప్రాజెక్టులు కట్టడంలో విపరీత జాప్యం ఏర్పడింది. చట్టబద్ధ సమస్యలకు అంతే లేదు. నిర్వా సితుల సమస్య అమానవీయంగా మారింది. దీంతో పాలమూరులో కట్టే ప్రాజెక్టులపైన సంతోషం బదులు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నదని పాలమూరు రాజ కీయ నాయకులే ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో ఎన్నికలు రానే వచ్చాయి. కొం చెం ముందే వచ్చాయి. ఎందుకు ఇంత ముందుకు జరిపారో పాలకులకే తెలియాలి. పాలమూరు పౌర సమాజం కొంచెం మేల్కొంది. అధ్యయన వేదిక నీటి సమస్యను మరోసారి ముందుకు తెస్తూ, 2018 అక్టో బర్ తొమ్మిది, పది తేదీలలో ముప్పై గంటల నిరా హార దీక్షా శిబిరాన్ని నిర్వహించింది. ఇందులో రాఘ వాచారి, కె.సి.వెంకటేశ్వర్లు, పి.హనుమంతు, ఎల్. అశోక్, ఎం.శంకర్, ఎన్.యాదయ్య పాల్గొన్నారు. వీళ్ళం దరూ అధ్యయన వేదిక సభ్యులే. నిరాహార దీక్ష కూడా భాషే. దీని ద్వారా వ్యక్తులకుండే నిజా యితీ, సమస్యల పట్ల శ్రద్ధ ప్రజల పట్ల ప్రేమ వ్యక్త మౌతుంది. ఈ దీక్షకు వివిధ ప్రజా సంఘాలు, ప్రజా స్వామ్యవాదులు మద్దతు తెలిపారు. గాంధీ నిరాహార దీక్షను ఒక ఆయుధంగా ఉపయోగించారు. అప్పటి పాలకులు, సమాజం స్పందన కోల్పోలేదు. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇలాంటి నిరసన రూపాలు పాలకు లను ప్రభావం చేసే కంటే ఇందులో పాల్గొన్న వాళ్ళు తమ నిజాయితీని కాపాడుకోవడానికి ఎక్కువ దోహ దపడుతుంది. దీక్షకు మద్దతు తెలిపిన సంఘాలే షాద్ నగర్ ప్రాంతంలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కొరకు మూడు రోజులు అక్టోబర్ 17, 18, 19 తేదీలలో పాద యాత్ర చేసి కింది నుంచి ప్రజలను కదిలించారు. ఈ ప్రాజెక్టు లేకుంటే ఈ ప్రాంతం దుర్భిక్ష ప్రాంతంగా మారుతుంది. సముద్రమట్టం కంటే ఈ ప్రాంతం చా లా ఎత్తులో ఉండడం వలన భూగర్భ జలాలు కూడా చాలా తక్కువ. ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టే ప్రాణ వాయువులాంటిది.

పాలమూరు సమస్యలపై ప్రజా సంఘాలే కాక కవులు, కళాకారులు కూడా చాలా పెద్ద ఎత్తున స్పం దించి రాసిన కవిత్వం జలగోస నిరాహారదీక్ష శిబిరం లో ఆవిష్కరింపబడింది. ఆవిష్కరణ ఒక్క వ్యక్తిచే గా క శిబిరంలో పాల్గొన్న అందరూ సమిష్టిగా ఆవిష్క రించారు. ఇందులోని కవితలు కవుల హృదయ స్పం దనకు అద్దం పడతాయి. మొత్తంగా పాలమూరు పౌర సమాజం సజీవంగా ఉంది. ఎంతకాలం ప్రజలు తమ సమస్యలకు తామే ప్రత్యక్షంగా పోరాడుతారో అంత దాక పౌరసమాజంలోని ప్రజాస్వామ్య శక్తులపై కొంత భారం ఎక్కువే ఉంటుంది. పాలమూరు ప్రజలు అర్థ చైతన్య దశలో ఉన్నారు. వాళ్ళకు సమస్యలు వాళ్ళకు తెలుసు, కారణాలు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుం టున్నారు. ప్రజల చైత న్య దశ పూర్తిస్థాయిలో లేనంత కాలం ప్రజా ప్రతినిధులు బాధ్యతగా సమస్యల కొర కు పోరాడరు. అర్థ చైతన్య దశను మరో అడుగు ముందుకు తీసుకుపోవడానికి దీక్షా శిబిరం, పాదయా త్రలు లాంటి ప్రక్రియలు పరిణామక్రమంలో గుర్తుం డే మైలు రాళ్ళుగా పనిచేస్తాయి. 

English Title
Palamuru Jalgosa
Related News