ప్రధాని కాన్వాయ్‌పై బాంబుదాడి.. తప్పిన ప్రమాదం

Updated By ManamTue, 03/13/2018 - 18:35
Palestinian Prime Minister, Gaza Assassination Attempt, Rami Hamdallah

Palestinian Prime Minister, Gaza Assassination Attempt, Rami Hamdallah గాజా స్ట్రిప్: పాలస్తీనా ప్రధాన మంత్రి రమి హమదల్లా కాన్వాయ్‌పై బాంబు దాడి జరిగింది. ఆయన కాన్వాయ్‌ మంగళవారం ఉదయం గాజా ప్రాంతంలోకి ప్రవేశించగానే 200 మీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులకు గాయాలైనట్లు భద్రత సిబ్బంది వెల్లడించారు. ప్రమాదంలో ప్రధానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టంచేశారు. కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. మిలిటెంట్‌, పొలిటికల్‌ ఇస్లామిస్ట్‌ గ్రూప్‌కు చెందిన హమస్‌ ఆధీనంలో ఉన్న గాజా ప్రాంతంలో ప్రధాని హమదల్లా పర్యటించడం చాలా అరుదు. హమస్‌ గ్రూప్‌కు చెందిన వారే ప్రధాని కాన్వాయ్‌పై దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నట్టు పాలస్తీనా అధికార వర్గాలు వెల్లడించాయి. హమస్‌ అధ్యక్షుడు మహ్‌మూద్‌ అబ్బాస్‌ దీనికి కారణమని ఆరోపించారు. హమదల్లా సురక్షితంగా ఉన్నాట్టు అధికారులు స్పష్టంచేశారు. కాగా, బాంబు దాడి ఘటనలో చాలామంది స్వల్పంగా గాయపడినట్టు గాజా అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటనలో వెల్లడించింది. కొందరు అనుమానితులను అరెస్ట్ చేసిన భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు.
Palestinian Prime Minister, Gaza Assassination Attempt, Rami Hamdallah

Palestinian Prime Minister, Gaza Assassination Attempt, Rami Hamdallah

 

English Title
Palestinian Prime Minister Survives Gaza Assassination Attempt; 'Israel Responsible'
Related News