పారడైజ్‌ పేపర్ల కలకలం.. జాబితాలో 180 దేశాలు

Updated By ManamMon, 11/06/2017 - 21:34
paradise
  • పేర్ల సంఖ్య రీత్యా భారత్‌కు 19వ స్థానం

  • లెక్కతేలిన భారతీయ పెద్దలు 714 మంది

  • కేంద్ర సహాయ మంత్రి జయంత్ కూడా...

  • ఐసీఐజేకి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సహకారం

paradiseన్యూఢిల్లీ, నవంబరు 6: బెర్ముడాలోని ప్రపంచవ్యాప్త న్యాయసేవల సంస్థ యాపిల్‌బై డేటాబేస్‌లోని విదేశీ పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను అంతర్జాతీయ పరిశోధక పాత్రికేయ సమాఖ్య (ఐసీఐజే) పారడైజ్ పత్రాల పేరిట వెల్లడించింది. దీంతో  వివిధ దేశాల్లో కలకలం మొదలైంది. రెండు విదేశీ సేవా సంస్థలు, యాపిల్‌బై రిజిస్ట్రీలోని 19 పన్ను స్వర్గాల వంటి దేశాల వివరాలకు సంబంధించిన 1.34 కోట్ల పత్రాలను ఐసీఐజే బయటపెట్టింది. భారత్‌లో ఈ సంస్థ భాగస్వామిగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వ్యవహరించింది. మొత్తం మీద 180 దేశాలకు చెందిన వివరాలు ఈ పత్రాల్లో ఉండగా వాటిద్వారా వెల్లడైన బడాబాబుల పేర్ల సంఖ్య రీత్యా భారత్ 19వ స్థానంలో ఉంది. మొత్తంమీద ఈ జాబితాలో 714 మంది భారతీయుల పేర్లున్నాయి. వీరిలో కేంద్ర సహాయ మంత్రి జయంత్‌సిన్హా పేరు కూడా ఉంది. 

అయితే, సదరు లావాదేవీలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని భారత్‌లో ఒమిడ్యార్ నెట్‌వర్క్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన ఖండించారు. ఈ సంస్థ కేమన్ ఐలాండ్స్‌లోని అమెరికా సంస్థ డి.లైట్ డిజైన్ కంపెనీ అనుబంధ సంస్థలో పెట్టుబడులు పెట్టిందని పారడైజ్ పత్రాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఆ కంపెనీ ప్రతినిధిగా తాను నిర్వహించిన లావాదేవీలన్నీ చట్టబద్ధం, సక్రమమైనవేనని జయంత్ ట్విట్టర్‌ద్వారా స్పష్టీకరించారు. తాను ఆ సంస్థను వదిలేసిన తర్వాత డి.లైట్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉండాలని కోరారని పేర్కొన్నారు. అయితే, తాను కేంద్ర మంత్రి మండలిలో చేరిన తక్షణమే ఆ పదవికి రాజీనామా చేశానని తెలిపారు.

English Title
Paradise Papers: Biggest data leak reveals trails of India’s corporates in global secret tax havens
Related News