ప్రముఖ సినీ దర్శకురాలు కన్నుమూత

Updated By ManamSun, 09/23/2018 - 09:50
Kalpana Lajmi passed away
Kalpana Lajmi passed away

న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ సినీ దర్శకురాలు, నిర్మాత కల్పనా లజ్మి (64) ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె కిడ్నీ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కాగా కల్పనా లజ్మి మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. హీరోయిన్ హుమా ఖురేషీ, ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ సతీమణి సోని రజ్దాన్‌ తదితరులు కల్పనా లజ్మి మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘నా ప్రియ స్నేహితురాలు కల్మనా లజ్మి శాంతి కోసం వెళ్లింది. రిప్ మై డార్లింగ్ కల్పనా. నిన్ను నేనెంతో మిస్ అవుతున్నా’ అంటూ సోని రజ్దాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా కల్పనా లజ్మి దర్శకత్వంలో డింపుల్ కపాడియా ప్రధాన పాత్ర పోషించిన 'రుడాలి' అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత  స్త్రీ ప్రధాన కథా ఇతివృత్తాలకు వివిధ కోణాలను ఆవిష్కరిస్తూ ఆ తర్వాత ‘దమన్’ ‘చింగారీ’ సినిమాలు కూడా ఆమె తెరకెక్కించారు. ఉత్తరప్రదేశ్‌లోని రంగ్‌పూర్ గ్రామానికి చెందిన ఓ వేశ్య వాస్తవ జీవితగాథ ఆధారంగా ప్రఖ్యాత దర్శకురాలు కల్పనా లజ్మి రూపొందించిన 'చింగారి' చిత్రం తెలుగులో 'ఒసేయ్.. మల్లమ్మ' పేరుతో అనువాదం అయింది.

English Title
Bollywood Filmmaker Kalpana Lajmi passes away
Related News