జగన్‌కు పరిటాల సునీత సవాల్

Updated By ManamThu, 10/18/2018 - 14:44
Jagan, Paritala Sunitha

Jagan, Paritala Sunithaఅమరావతి: డ్వాక్రా రుణమాఫీపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు మంత్రి పరిటాల సునీత చాలెంజ్ విసిరారు. డ్వాక్రా మహిళలకు చేయూతపై డిబేట్‌కు జగన్ సిద్ధమా అంటూ పరిటాల ప్రశ్నించారు. ఏ వేదికపైనైనా జగన్‌తో చర్చను తాను సిద్ధమని.. జగన్ రెడీనా అంటూ సునీత ప్రశ్నించారు. ఏపీ పాలిట జగన్ మహిషాసురుడని, కోటి మంది డ్వాక్రా మహిళలను జగన్ అవమానించారని ఆమె విమర్శించారు. పసుపు-కుంకుమ పథకాన్ని హేళన చేయడం జగన్ రాక్షసత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. 10రోజుల్లో డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలల్లోకి పసుపు-కుంకుమ తుది విడత నిధులను మంజూరు చేస్తున్నామని సునీత తెలిపారు. 2019 ఎన్నికల్లో జగనాసురుడిని మర్దించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

English Title
 Paritala Sunitha challenges to YS Jagan Mohan Reddy
Related News