టీఎస్‌ఆర్టీసీ బస్సులో పైరసీ చిత్రం.. కేటీఆర్ ఆగ్రహం

Updated By ManamMon, 04/16/2018 - 10:49
TSRTC bus, Garuda volvo bus, KTR, Krishnarjuna yuddham, Nani

TSRTC bus, Garuda volvo bus, KTR, Krishnarjuna yuddham, Nani హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాల ప్రదర్శనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సినిమాలు విడుదలైన మరుసటి రోజే ఓ కొత్త సినిమాను ఆర్టీసీ బస్సుల్లో ప్రదర్శించినట్టు ఆయనకు ఫిర్యాదు అందింది. యువ హీరో నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రం విడుదలైన మరుసటి రోజే గరుడ బస్సులో ప్రదర్శించినట్టు సునీల్ అనే యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న గరుడ వోల్వో బస్సులో ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాన్ని ప్రదర్శించారంటూ సునీల్.. తన ఫోన్‌లో టీవీ స్ర్కీన్ షాట్‌ను తీసి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో పంపాడు. ప్రభుత్వ సంస్థలైన ఆర్టీసీ బస్సుల్లోనే ఇలాంటి పైరసీలను ఆరికట్టడంలో విఫలమైనప్పుడు.. మరి.. ఒక సాధారణ వ్యక్తిని పైరసీని అరికట్టాలని ఎలా అడుగుతారని ప్రశ్నించాడు.

యువకుడు సునీల్ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్.. ఆర్టీసీ సిబ్బంది బాధ్యతా రాహిత్యంపై మండిపడ్డారు. ఇకపై ఆర్టీసీ బస్సులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్టీసీ ఎండీని ఆయన కోరారు. కాగా, నాని ద్విపాత్రాభినయం చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నానికి జోడీగా అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మిర్‌ నటించారు.

English Title
A passanger complained on Piracy movie show in TSRTC bus, Minister KTR fire
Related News