‘కయిత’కు ‘పఠాభి’షేకం

Updated By ManamMon, 02/19/2018 - 02:34
thikkavarapu pattabhi

thikkavarapu pattabhiనమ్మిన సిద్ధాంతం కోసం, చేరదలచిన లక్ష్యం కోసం, అడ్డంకులనూ, అవరోధాలనూ లక్ష్యపెట్టని సాత్విక సాహసి. నూతనత్వం కోసం అన్వేషించే సుప్రతిష్ఠితుడు. అంతరాంతరాల్లో అచ్చయిన విప్లవకవి ‘‘పఠాభి’’. భావకవిత్వం మీద పనిగట్టుకొని దండయాత్ర చేసినవాడు. అనుసరిస్తాను నవీనపంథా... నేనహంభావ కవిని అని ప్రకటించుకొని కవిత్వపరంగా ఆనాటి కవిత్వానికి విద్యుత్ చికిత్స చేశారు. భావ కవిత్వంలో ఏవి సున్నితంగా చెప్పుకుంటారో వాటినన్నింటినీ హేళనచేస్తూ సాగిన కవిత్వం. తెలుగు కవిత్వంలో చిరకాలంగా కవితా వస్తువులుగా అలవాటయిన ప్రతి వస్తువునూ, భావాన్నీ, శైలినీ అకవిత్వాంశాలుగా ప్రదర్శించిన అక్షర సాహసి పఠాభి. దాదాపు ఎనిమిది దశాబ్ధాల క్రితం వెలువడ్డ ‘ఫిడేలు రాగాల డజన్’ తనను చాలా ప్రభావితం చేసిందని ఆరుద్ర స్వయంగా ప్రకటించుకున్నారు. ఈనాడు ఆరుద్ర ముద్ర అనేదంతా నిస్సందేహంగా పఠాభిముద్రే. దానిని దాటి ఆరుద్ర బయటపడలేదని శ్రీశ్రీ ఒకచోట ప్రకటించారు. పాతను తోసిపుచ్చి కొత్త ప్రక్రియ పురుడుపోసుకున్న ఆ సమయంలో సంప్రదాయ కవులు విరుచుకుపడ్డారు, మండిపడ్డారు, ఛందోజ్ఞానం లేదు, ఈ కొత్త కవులు అన్నీ సంకరం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. కొత్త ప్రక్రియ విమర్శలకు గురికావటం తెలుగు కవిత్వంలో కొత్త ఏమీ కాదు. నండూరి సుందరైమెన భావాలను సరళైమెన భాషలో పాటగా మలిచినప్పుడూ, 1917లో వారు వెలుగులోనికి తీసుకువచ్చినప్పుడు అప్పటి పండితులు, చాదస్తులూ విరుచుకుపడ్డారు. శ్రీరంగం నారాయణబాబు, శిష్‌ట్లా ఉమామహేశ్వరరావు, శ్రీశ్రీ వీరంతా ఇలాంటి విమర్శలు ముందు - వెనుక ఎదుర్కొన్న వారే. కానీ ‘పఠాభి’ ఎనిమిది దశాబ్దాల కిందట తెలుగు సాహితీవనంలో అడుగుమోపిన పఠాభి ఫిడే లు రాగాల డజన్ ఆ క్షేత్రాన్ని కుదిపివేసింది. అల్లకల్లోలం చేసింది. అత్యధికంగా పఠాభిని దుమ్మెత్తిపోయగా, కొద్దిమంది ఆయన పక్షాన నిలిచారు. ఆయన కవిత్వంలోని కొత్త కవిత్వంలోని సరికొత్త అందాలను తెలుగుభాషకు, సాహిత్యానికి అందచేసిన ఆయనను ఆదర్శంగా అనుసరించినవారూ, ఆదర్శంగా తీసుకున్న వారూ ఉన్నారు. వీరి కవిత్వంపై అనేక విమర్శలు, సమీక్షలు పుంఖానుపుంఖాలుగా వెలువడ్డాయి. వీరి కవిత్వం తెలుగు విమర్శకులను రెండుగా చీల్చింది. వీరి కావ్యాల ముందుమాటలు, మంచిమాటలపై కూడా చర్చలు, వాదోపవాదాలు జరగటం, అధ్యయనపు వస్తువులుగా ఉపకరించటం వరకు వెళ్లాయి. చలం, దువ్వూరు రామిరెడ్డి, శ్రీపాద గోపాల కృష్ణమూర్తి, కె.వి.రమణారెడ్డి, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, త్రిపురనేని, విశ్వనాథ, విశ్వం, శ్రీశ్రీ, వేల్చేరు లాంటి ప్రముఖుల మధ్య జరగటం విశేషం. శ్రీశ్రీ ఇంట్రోను రామిరెడ్డి సుదీర్ఘైమెన వ్యాసమే రాశారు. త్రివేణి లాంటి ఆంగ్ల పత్రికల్లో సైతం పఠాభిపై సమీక్షా వ్యాసాలు వెలువడ్డాయి. తెలుగు కవిత్వంలో ప్రకంపనాలు సృష్టించి, నేటికీ సరికొత్త కవిత్వానికి వేదిైకెన పఠాభి ఎవరు? 

‘పఠాభి’గా పరిచయైమెన తిక్కవరపు పట్టాభిరెడ్డిది అధికార ఐశ్వర్య కుటుంబం. స్వాతంత్య్ర సమరయోధుడు, బాపూజీకి మిత్రుడు, సాహిత్య పోషకుడు, వందేళ్ల క్రితం తిక్కన జయంతులు ప్రవేశపెట్టిన తిక్కవరపు రామిరెడ్డి కుమారుడు.. బెజవాడ గోపాలరెడ్డి మేనల్లుడు. 1919 ఫిబ్రవరి 19న నెల్లూరులో జననం. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల శాంతినికేతన్, కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం. స్నేహలతా పావెల్‌తో జీవితం పంచుకున్న సంస్కారి. పుచ్చలపల్లి సుందరయ్య ఆయన బంధువు. ఎమర్జన్సీ రోజుల్లో ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించి, భార్య స్నేహలతారెడ్డితో కలసి అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ సందర్భంగా అరెస్టు అయిన స్నేహలతారెడ్డి జైలులోనే చిత్రహింసలకు గురై కొద్దిరోజులకే మరణించారు. పద్నాలుగేళ్ల వయస్సులోనే స్థానిక పత్రికలో వీరి పద్యాలు అచ్చయినాయి. నిర్మాత, దర్శకుడు కె.వి.రెడ్డికి అసోసియేట్ ప్రొడ్యూసరుగా జయంతి పిక్చరుపై తెలుగు, కన్నడ చిత్రాలు పొంది ప్రాంతీయ, జాతీయ అవార్డులను, ‘సంస్కార’ కన్నడ చిత్రం ద్వారా జాతీయ ఉత్తమ చిత్రంగా స్వర్ణకమలం అందుకున్నారు. అంతర్జాతీయ రష్యా, చైనాల కమ్యూనిజం పాత్ర నచ్చలేదని చెప్పే పఠాభి లోహియా ప్రభావితుడై సోషలిజం వైపు మళ్లానని చెబుతారు. ‘నాకు కవిత్వాభిక్ష పెట్టింది శ్రీశ్రీ అని లోకులు అనుకుంటారు. నిజానికి కవితాదీపం నాలో వెలిగించింది పఠాభి’ - అని స్వయంగా ఆరుద్ర ప్రకటించుకున్నారు. నారాయణబాబుకు స్పష్టైమెన మార్గం లేదు, కానీ పఠాభి ఒక నిర్ధిష్టైమెన మార్గాన్ని నిరాఘాటంగా యెన్నుకున్నారని త్రిపురనేని ప్రకటించారు. తెలుగులో రాసిన కవిత్వమే అయినా, తెలుగు ప్రాంతానికి దూరంగా ఉండి ఫిడేలు రాగాల డజన్, కయిత నా దయిత, పఠాభి పన్‌చాన్‌గమ్‌తో తెలుగు కవిత్వానికే పారిజాతాలు అందించిన తొలి తెలుగు కవిగా నిలిచిపోయారు.
- ఈతకోట సుబ్బారావు
8008562742

English Title
Pathabhishekam for the title
Related News