ఉస్మానియాలో హృదయ విదారక ఘటన

Updated By ManamTue, 02/13/2018 - 13:26
boy

boyహైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో హృద‌య విదారక సంఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. తల్లి గుండెపోటుతో విగతజీవిగా మారగా ఐదేళ్ల బాలుడి పరిస్థితి దయనీయంగా మారింది. సమీనా సుల్తానాను మూడేళ్ల క్రితమే కట్టుకున్న భర్త వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కూలీనాలీ చేస్తూ తన కుమారుడిని పెంచి పోషిస్తోంది సుల్తానా. గత కొంతకాలంగా హృద్రోగ సమస్యతో ఆమె బాధపడుతోంది. ఫిబ్రవరి 11న‌ రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సుల్తానా...ఉస్మానియాలోని ఎమ‌ర్జెన్సీ వార్డులో చేర్చారు. ఆమెతో పాటే ఆమె అయిదేళ్ల కుమారుడు కూడా ఆస్పత్రిలోనే ఉన్నాడు. రక్తపోటు, పల్స్‌ బాగా పడిపోవడంతో ఆమె కన్ను మూసింది. తన తల్లి ఇక లేదన్న విషయం తెలియని ఆ పసివాడు ఆకలితో అలమటిస్తూ త‌ల్లి మృతదేహం పక్కనే చాలా సేపు పడుకున్నాడు. 

హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్ వాలంటీర్లు, వైద్య సిబ్బంది ఆ బాబును తల్లి మృతదేహం పక్క నుంచి తీసి... వేరే గదిలో పడుకోబెట్టారు. మృతురాలి గురించి ఎలాంటి సమాచారమూ తెలియ రాలేదు. దీంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించగా..  ఆమె వేలి ముద్ర సాయంతో ఆధార్‌కార్డు వివరాల మేరకు జహీరాబాద్‌లోని బంధువులకు ఆమె స‌మాచారం అందించారు. ఆమె బంధువులు సోమవారం ఆసుపత్రి దగ్గరకు చేరుకోగా.. పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. 

English Title
Pathetic situation of a boyRelated News