దూకుడు పెంచిన పవన్.. వారిద్దరికి ఫోన్

Updated By ManamWed, 02/14/2018 - 22:36
pawan

pawanహైదరాబాద్: సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా దూకుడు పెంచాడు. విభజన హామీల్లో కేంద్ర కేటాయింపులపై నిజనిర్థారణ కమిటీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తోన్న పవన్ కళ్యాణ్.. ఇప్పటికే లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌లతో భేటీ అయ్యారు. వీరితో పాటుగా మేథావులు, ఆర్ధిక వేత్తలు కూడా ఈ కమిటీలో భాగస్వాములు అవుతారని ప్రకటించిన పవన్.. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీపీఐ, సీపీఎం కార్యదర్శులు రామకృష్ణ, పి. మధుకు ఫోన్ చేశారు. ఈ నెల 16న హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో హాజరు కావాలని కోరారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తికి వారిద్దరూ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

English Title
pawan kalyan call to cpi madhu
Related News