2019లో పోటీపై క్లారిటీ ఇవ్వని పవన్!

Updated By ManamMon, 01/22/2018 - 18:18
pk

pawan kalyanకరీంనగర్: కొండగట్టు నుంచి రాజకీయ యాత్రను ప్రారంభించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దర్శనానంతరం కరీంనగర్‌‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు సమస్యల గురించి ప్రస్తావించారు. తెలంగాణ సమస్యలపై తమ బృందం అధ్యయనం చేస్తోందని పవన్ చెప్పారు. జనవరి 23,24తేదీల్లో అంటే రేపు, ఎల్లుండి పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సమస్యలపై తెలంగాణలో అన్ని జిల్లాల కార్యకర్తలతో చర్చిస్తానని పవన్ చెప్పారు. సమస్యలపై కార్యకర్తలతో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి సూచనలు చేస్తానని ఆయన వెల్లడించారు. జనవరి 27నుంచి అనంతపురంలో కరవు యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వాలతో గొడవ పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని పవన్ చెప్పడం విశేషం. ఏపీ ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాల్సిన సమస్యలు ఉన్నప్పటికీ.. సమస్యకు పరిష్కారం కావాలన్న ఉద్దేశంతోనే సున్నితంగా వ్యవహరిస్తున్నట్లు పవన్ తెలిపారు. 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు పవన్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఎన్నికలకు రెండు నెలల ముందు తమ పార్టీ సామర్థ్యాలపై ఓ అవగాహనకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు.

English Title
pawan kalyan press meet in karimnagar
Related News