కొండగట్టు నుంచి పవన్ యాత్ర

Updated By ManamSat, 01/20/2018 - 19:54
pawan kalyan
pawankalyan

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తన రాజకీయ పర్యటన ప్రణాళికను అక్కడే ప్రకటిస్తానని శనివారం సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. తమ కుటుంబానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఇలవేల్పుగా పేర్కొన్నారు. అందుకే కొండగట్టు నుంచి తన నిరంతర రాజకీయ యాత్రను ప్రారంభించడానికి కారణమని తెలిపారు. 2009లో ఎన్నికల ప్రచార సమయంలో పెను ప్రమాదం నుంచి తాను ఇక్కడే క్షేమంగా బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యల అధ్యయనం, అవగాహన కోసం ఈ యాత్రతో వస్తున్నట్లు తెలిపారు. తనను తెలుగు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కొండగట్టుకు ఎప్పుడు వెళ్లేది పవన్ ఆదివారం ప్రకటిస్తారని సమాచారం. 
 

English Title
Pawan kalyan to start political tour from kondagattu
Related News