కొండగట్టుకు బయలుదేరనున్న పవన్ కల్యాణ్

Updated By ManamMon, 01/22/2018 - 08:08
Pawan kalyan

Pawan Kalyanహైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉదయం 9గంటలకు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కొండగట్టును బయలుదేరనున్నారు. మధ్యాహ్నం అక్కడ కొండగట్టు ఆంజనేనస్వామిని దర్శించుకున్న అనంతరం కరీంనగర్‌ పర్యటనకు వెళ్లనున్నారు.

తెలంగాణలో మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఛలోరే చల్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం ఉదయం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్న పవన్, అక్కడి జనసేన కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఆ తరువాత మంగళవారం మధ్యాహ్నం కొత్తగూడెంకు వెళ్లనున్న పవన్, రాత్రికి అక్కడే బస చేసి బుధవారం ఖమ్మంకు వెళ్లనున్నారు. ఇక బుధవారం పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3గంటలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో జనసేన కార్యకర్తలతో భేటీ కానున్నారు.

English Title
Pawan Kalyan starts to Kondagattu
Related News