బాబుపై పవన్ ప్రశ్నల వర్షం!

Updated By ManamWed, 03/14/2018 - 20:26
Pawan kalyan Stright Questions To CM Chandrababu Naidu

Pawan vs chandrababu

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ వేదికగా సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కొన్ని పదుల ప్రశ్నలు బాబుకు పవన్ సంధించారు.

చంద్రబాబుకు సూటి ప్రశ్నలు..
"లక్షల కోట్ల ఎంవోయూలు జరుగుతున్నాయి..కానీ ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదు. హోదామీద నేను మాట్లాడినప్పుడు చీకటి ఒప్పందాలు చేసుకొని ప్యాకేజీకి రెడీ అయ్యారు. ప్రజలకు తెలివితేటలు లేవని ముఖ్యమంత్రి అనుకుంటున్నారా?. పోలవరాన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇప్పించేందుకు చేసిన ప్రయత్నం హోదా కోసం ఎందుకు చేయలేదు. పోలవరం ముంపు మండలాలకోసం పోరాటం చేసినట్లు హోదా కోసం ఎందుకు పోరాడలేదు?. హోదా కోసం పోరాటం చేయకుండా మా ఆత్మ గౌరవం మీరు కొట్టారు. (తెలుగుదేశం పార్టీ నేతలతో సహా). చిత్తుశుద్ధి ఉంటే హోదాను ఎందుకు తీసుకురాలేకపోయారు. టీడీపీ ఇలా అయిపోవడం బాధగా ఉంది. తెలంగాణ తరహాలో హోదా ఉద్యమం తీసుకెళ్లటం లేదంటున్నారు. ఆంధ్ర రాజకీయాలు అంత సున్నితమైనవా?. 2019లో పవన్ మాతో కలిసుంటాడో లేదో తెలియదు అందుకే మేం అవినీతికి పాల్పడతామని అంత బాహాటంగా మాట్లాడుతుంటే అంత బరితెగింపు ఉంటే మిమ్మల్ని ఏం చేయాలి. మీ హెరిటేజ్ నుంచి ఏం డబ్బులు తీయట్లేదు కదా?. మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా?. టీడీపీ నేతలు నియోజకవర్గానికి మేమంతా డబ్బులంతా పాతికకోట్లు అప్పుడే సర్దేశాం.. అని బాహాటంగా మాట్లాడుతుంటే ఏమనుకోవాలి. ప్రజా స్వామ్యాని పరిహాసం చేస్తున్నారు మీరంతా. మీరు చేసే పనులు చూస్తుంటే టంగుటూరి ప్రకాశం పంతులు, దివంగతనేత ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది" అని సీఎం చంద్రబాబుపై పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు.

బాంబులు పెట్టి లేపేస్తారు!
"ఏపీ యువత ప్రాణాలు నేను ఫణంగా పెట్టను. నేను ఎవర్నీ ఇబ్బందిపెట్టను. సభ పెడతావ్ వెళ్లిపోతావ్ అని నన్ను చాలా మంది అడిగారు.. అందరూ అడుగుతారే తప్ప ఒక్కరంటే ఒక్కరు సభ పెట్టి అడగలేరు. మీరు దమ్ముంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాట్లాడండి. కనీసం టీవీల్లో కూడా మాట్లాడలేరు.. మీరు జనసేనను, పవన్‌ను అంటారా?.  నా నేల, మాతృభూమి కోసం చనిపోవడానికైనా సిద్ధమే. మీకు అంత ఇష్టం ఉందా జనం మీద?. సాటి మనిషిని చూసి కన్నీరు కార్చే శక్తి ఉందా?. అసెంబ్లీలో కూర్చోని మీరేం మాట్లాడుతున్నారు. ఒళ్లు గగుర్పొడిచేలా మాట్లాడుతున్నారు. ఎందుకు అవన్నీ?. ఇక్కడి నాయకులు బాంబులు పెట్టి పేల్చేస్తారు. నాకు మీ ప్రాణాలు చాలా ముఖ్యం.. అందుకే బాధ్యతగా మాట్లాడతాను" అని పవన్ స్పష్టం చేశారు.

వైసీపీ నాయకులను ఉద్దేశించి..
"వైసీపీ వాళ్లు టీడీపీతో బలంగా పోరాడట్లేదు. అసలు అసెంబ్లీకే రారు. (ఏంటిది చేతులు ఇలా చూపిస్తూ). మీరు ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వెళతారా (జగన్‌ను ఉద్దేశించి). నేను ముఖ్యమంత్రి కాలేదు.. సమస్యల మీద పోరాడం లేదా?. ఆ విధానం మీరు తెలుసుకోవాలి.. అది తెలుసుకున్నంత కాలం మీ లక్ష్యం నెరవేరదు.. చాలా కష్టం" అని పవన్ చెప్పుకొచ్చారు.

English Title
Pawan kalyan Stright Questions To CM Chandrababu Naidu
Related News