అంజన్నా.. చల్లగా చూడు

Updated By ManamMon, 01/22/2018 - 14:21
Pawan Kalyan

Pawan Kalyanకరీంనగర్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పూజారులు అతడికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా.. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆంజనేయుడి ఆశీస్సులు తీసుకున్నారు పవన్ కల్యాణ్. 

ఈ సందర్భంగా ఆలయానికి 11లక్షల విరాళాన్ని అందజేశారు పవన్. అనంతరం మాట్లాడుతూ.., "ఆంజనేయ స్వామి అనుగ్రహంతోనే పార్టీని స్థాపించాను, స్వామి ఆశీస్సులతోనే 2009లో బతికి బట్ట కట్టాను. నన్ను చల్లగా చూడాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తాను" అని పవన్ తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు పవన్ రాకతో కొండగట్టు ప్రాంతం జనసంద్రంగా మారింది. వేలాదిగా వచ్చిన అభిమానులు పవన్‌తో చేయి కలిపేందుకు ఎగబడుతున్నారు.

English Title
Pawan Kalyan visited Kondagattu
Related News