లక్నో చేరుకున్న పవన్ కల్యాణ్

Updated By ManamWed, 10/24/2018 - 09:57
Pawan Kalyan

Pawan Kalyanఅమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఉత్తరప్రదేశ్‌లోని లక్నో చేరుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు పాల్గొనబోయే సమావేశంలో పవన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఈ ఉదయం హుటాహుటిన లక్నో బయల్దేరిన పవన్, కాసేపటి క్రితమే అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి వారు ఆయనకు సాదర స్వాగతం పలికారు. పవన్‌తో పాటు నాదేండ్ల మనోహర్, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులతోపాటు విద్యావేత్తలు కూడా అక్కడకు వెళ్లారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రారంభించాలనుకుంటున్న రాజకీయ పార్టీల కూటమిపై, అలాగే తెలంగాణలో ఎన్నికలపై పవన్ వారితో చర్చలు జరపనున్నట్లు సమాచారం.

English Title
Pawan Kalyan went to Uttarapradesh
Related News