నాపై దాడి జరిగితే జన జీవనంపై తీవ్ర ప్రభావం: పవన్

Updated By ManamTue, 03/13/2018 - 20:02
pk

pawan kalyanహైదరాబాద్: ఏపీ డీజీపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. మార్చి 14న నిర్వహిస్తున్న జనసేన ప్లీనరీ సభ అనంతరం కూడా తనకు వ్యక్తిగత భద్రతను కొనసాగించాల్సిందిగా పవన్ లేఖలో డీజీపీని కోరారు. తాను భద్రత కోరుతున్నది ప్రదర్శనా కుతూహలంతో కాదని, సమాజంలో ఉన్న కుల ఉద్యమాలు, వర్గ పోరాటాలు, రాజకీయ అణచివేతల నడుమ తన భద్రత సున్నితమైన సామాజిక రాజకీయ సమస్యలతో ముడిపడి ఉందని పవన్ పేర్కొన్నారు. తనపై ఏదైనా దాడి జరిగితే ప్రజాజీవితంపై అది తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన లేఖలో వివరించారు. కాకినాడలో సభా ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాట, విజయవాడలో సీఎంను కలిసేందుకు వచ్చినప్పుడు ట్రాఫిక్ స్థంభించడం తదితర ఇబ్బందులున్న నేపథ్యంలో భద్రతను కోరుతున్నట్లు పవన్ పేర్కొన్నారు.

janasena

English Title
pawan kalyan write a letter to ap dgp
Related News