చంద్రబాబును ఏకిపారేసిన పవన్..!

Updated By ManamWed, 03/14/2018 - 19:38
pawan kalyan on cm

pawan on cm chandrababu

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడి నారా లోకేశ్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ వేదికగా.." విడిపోయిన రాష్ట్రానికి అనుభవజ్ఞుడు కావాలనే చంద్రబాబుకు మద్దతిచ్చాను. నాలుగేళ్లలో చంద్రబాబువి 3మాటలు.. ఆరు అబద్ధాలు. టీడీపీ ఇలా అయిపోవడం బాధాకరం. ప్రజలకు అండగా ఉంటారనే టీడీపీ మద్దతిచ్చాను. నేను ఏపీ పునర్ నిర్మాణానికే గానీ టీడీపీ పునర్మిణానికి మద్దతివ్వలేదు. ఇకపై టీడీపీ వైఫల్యాలను ఎండగడతాను" అని సభావేదికగా పవన్ స్పష్టం చేశారు.

రాజధానికి అన్ని ఎకరాల భూమెందుకు..?
"అసలు ఈ నాలుగేళ్లలో మీకు తెలియని విషయాలను చెబుతున్నాను. ముఖ్యమంత్రి గారిని కలుసుకున్నప్పుడు రాజధాని నిర్మాణానికి 1500 నుంచి 2వేల ఎకరాలుంటే చాలా అద్భుతంగా కట్టుకోవచ్చన్నారు. బాబు మాటలన్నీ నేను నమ్మాను. కానీ 1500 నుంచి వేలు పెరిగిపోతూ..  33వేలు మొదలుకుని దాదాపు లక్ష ఎకరాల దాకా విస్తరించింది. మీకు ఎన్నివేల ఎకరాలు కావాలి.. ఇంకా ఎన్ని వేల కోట్లు కావాలి. అభివృద్ధి చూస్తుంటే కొందరికేనా? అందరికీ కాదా?. అభివృద్ధి అందరికీ కావాలనే దిశగా తెలుగుదేశం నేతలు ఆలోచించడం లేదనే విషయం నాకు చాలా క్లారిటీగా అర్థమైంది" అని పవన్ చెప్పుకొచ్చారు.

విదేశీ పెట్టుబడులెక్కడా?
"విదేశాల నుంచి పెట్టుబెడులు వస్తాయన్నారు.. ఏవీ.. !. ఒక్క రూపాయంటే రూపాయి రాలేదు. ఈరోజు ఇంతమందికి ఉద్యోగాలెక్కడ్నుంచి ఇస్తారు? ఇంత కోట్లమంది యువతకు ఎక్కడ్నుంచి ఉద్యోగాలు తెచ్చిస్తారు?. కేవలం రాజధాని చుట్టే కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర ప్రాంతం ఏం కావాలి? రాయలసీమ ప్రాంతం ఏం కావాలి?. ప్రకాశం జిల్లా ఏం కావాలి?. ఆ అభివృద్ధి కూడా కొద్ది మందికేనా?. ఇలా చేస్తూ పోతే తెలంగాణ ఉద్యమం వచ్చినట్లుగా మరో ఉద్యమం రాదా?. అసలు ఆ కోణంలో మీరు ఎందుకు ఆలోచించట్లేదు. ఎందుకింత నిర్లక్ష్యం?" అని జనసేనాని ఆగ్రహించారు.

మీకెందుకు మద్దతివ్వాలి?
"
2019 ఎన్నికల్లో మీకెందుకు మద్దతివ్వాలో చెప్పండి?. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 'స్కాం ఆంధ్ర' అవ్వలేదు కానీ 'కరప్షన్‌ ఆంధ్ర' చెయ్యగలిగారు? రూ.3వేలకు లారీ ఇసుక దొరికితే.. ఇసుక ఉచితమని చెప్పి లారీ 15 వేలు చేశారని, ఇదేనా మీరు సామాన్యులకు ఇచ్చిన కానుకా?. భవన నిర్మాణాల ఖర్చును పెంచేశారు. పాలించడమంటే ఏదైనా ప్రత్యేక కలనా?. అనుభవం కావాలనే మీకు అండగా ఉన్నాను?. అసెంబ్లీలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారంటూ గుంటూరులో కలరా వచ్చి చనిపోయినవారిని చూస్తే బాధ కలగలేదా? శ్రీకాకుళం కిడ్నీ బాధితులను చూస్తే మీ బాధకలగలేదా?" అని బాబుపై పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు.

వాళ్లు చేసిన తప్పేంటి?
"ఫాతిమా కాలేజీ విద్యార్థులు చేసిన తప్పేంటి? మెడికల్‌ కాలేజీ యాజమాన్యం మోసం చేస్తే ప్రభుత్వం వాళ్లకే అండగా ఉందని, నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వం విఫలమైందనడానికి ఫాతిమా కాలేజీ విద్యార్థులే నిదర్శనం. ప్రభుత్వం ఫాతిమా విద్యార్థులకు ద్రోహం చేసిందని, అన్నీ చెబుతారు... ఏవీ నెరవేర్చరు. ఇది 80వ దశకంలో ఉన్న యువత కాదు..వాడి వేడి ఉన్న యువత అది గుర్తుంచుకోండి" అని ప్రభుత్వాన్ని పవన్ హెచ్చరించారు!.

 టీడీపీ వైఫల్యాలను ఎండగడతా?

" రోజు నుంచి టీడీపీ వైఫల్యాలను ఎండగడతాను. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలకు వివరిస్తాను. ఇసుక మాఫియాకు అండగా ఉన్న నేతలను నిలదీస్తా!. ఇసుక మాఫియాకు అండగా నిలబడినందుకు మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. ఎర్రచందనం అమ్మితే ఎన్నికోట్లు వచ్చాయో సత్యం మాట్లాడాలి. పర్యావరణాన్ని పరిరక్షిస్తే కాసింత అభివృద్ధి జరుగుతుంది..అభివృద్ధని, ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు పర్యావరణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నాయి.!. నిజాలు మాట్లాడండి.. అబద్ధాలెందుకు. ఏపీలో సరికొత్త రాజకీయశకం మొదలైంది. " అని పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

English Title
Pawan Sensational Comments On CM Chandrababu
Related News