‘బాకీల వసూలు యుద్ధ ప్రాతిపదికపై సాగాలి’

Updated By ManamThu, 07/19/2018 - 01:35
image

imageముంబై: స్ట్రెస్సడ్ అసెట్లు ప్రమాదకర స్థాయిలకు చేరడంతో, మొండి బాకీల వసూలు యుద్ధ ప్రాతిపదికన సాగాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేుషన్  కోరింది. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్స్రీ కోడ్ (ఐ.బి.సి) ద్వారా మొండి బాకీల పరిష్కారం, డిపాజిటర్ల నగదును పణంగా పెట్టి రుణాలు ఎగవేసిన కంపెనీలకు విముక్తి కల్పించడమే అవుతుందని అసోసియేషన్ అభిప్రాయపడింది. ‘‘మొండి బాకీల నిర్విరామ పెరుగుదలతో బ్యాంకింగ్ రంగం ప్రమాదకర మండలంలోకి ప్రవేశించింది. నిరర్థక ఆస్తులు 15 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు 9,063 మంది ఉన్నారని, వారంతా కలసి బ్యాంకులకు రూ. 1,10,050 కోట్లు బకాయిపడ్డారని ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో అంగీకరించింది.

కనీసం ఉద్దేశపూర్వక ఎగవేతదారులైనెనా క్రిమినల్ ప్రొసీడింగుల కిందకు తీసుకురావాలని ఎ.ఐ.బి.ఇ.ఎ తరఫున మేం డిమాండ్ చేస్తున్నాం. దీన్ని కావాలనే పక్కనపెడుతూ, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు’’ అని అసోసియేుషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్. వేంకటాచలం ఆరోపించారు. బ్యాంకు రుణాల ఎగవేతదారుల పేర్లను ప్రచురించాలని దీర్ఘ కాలంగా చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం, ఆర్.బి.ఐ ఇంకా ఆమోదించవలసి ఉందని ఆయన చెప్పారు. ‘‘తంలో కూడా, ఎగవేతదారుల పట్ల మృదువుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఒకే విడతలో పరిష్కారం, వడ్డీలు మాఫీ చేయడం, రాజీ పరిష్కారాలు, రీషెడ్యూలు, పునర్నిర్మాణం...,ఏకమొత్తంగా మాఫీ చేయడం వంటి సదుపాయాలు కల్పించారు. చిన్న సైజు రుణగ్రస్థులు, రైతులు, విద్యార్థులు వంటి వారి పట్ల రికవరీ చట్టాలు కఠినంగా ఉన్నాయి. వారిని అనుచితైమెన రీతిలో వేధింపులకు గురి చేస్తున్నారు. పెద్ద రుణగ్రస్థులకు మాత్రం పొడవూతా రాయితీలు ఇస్తున్నారు’’ అని అసోసియేుషన్ ప్రధాన కార్యదర్శి నిశితంగా విమర్శించారు. 

మొండి బాకీలు వసూలు చేయాలని అసోసియేుషన్ కోరుతూంటే, ప్రభుత్వం మొండి బాకీల పరిష్కారం గురించి మాట్లాడుతోందని వేంకటాచలం వ్యాఖ్యానించారు. ‘‘ఐ.బి.సియే వారి పరిష్కార మాడ్యూల్. కానీ, ఈ రకైమెన ప్రక్రియల్లో బ్యాంకులు నీళ్ళు వదులుకోవాల్సిన మొత్తాలు ఎక్కువగా ఉంటాయని ఆర్.బి.ఐ ఇదివరకే సూచించింది. ఇచ్చింది ఎక్కువ వచ్చేది తక్కువ. అది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు. భూషణ్ స్టీల్ ఉదంతాన్ని ఆయన ఇందుకు ఉదాహరణగా చూపారు. దాని నుంచి రూ. 56,000 కోట్లు రావలసి ఉన్నాయని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్ళగా, టాటాలు ఆ కంపెనీని రూ. 35,200 కోట్లకు స్వాధీనం చేసుకున్నారని అసోసియేుషన్ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఒక ఎన్.పి.ఏ ఖాతా పరిష్కారానికి దారి సుగమం అయింది. కానీ, బ్యాంకులు రూ. 21,000 కోట్లు కోల్పోయాయి. అంటే, అప్పుగా ఇచ్చిన మొత్తంలో దాదాపు 40 శాతానికి నీళ్లు వదులుకోవాల్సి వచ్చింది. ‘‘తర్వాత, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ వ్యవహారం వచ్చింది.

అది బ్యాంకులకు రూ. 13,600 కోట్లు చెల్లించవలసి ఉంది...వేదాంత దానిని రూ. 5,320 కోట్లకు కొనుగోలు చేసింది...బ్యాంకులు రూ. 8,400 కోట్లు త్యాగం చేయవలసి వచ్చింది. ఈ కేసులో బ్యాంకులు 60 శాతం నష్టాన్ని చూశాయి. ఇప్పుడు అలోక్ ఇండస్ట్రీస్ అంశం పరిష్కారానికి వచ్చింది. ఆ సంస్థ బ్యాంకులకు రూ. 30,000 కోట్లు రుణపడింది. రిలయన్స్ ఆ కంపెనీని రూ. 5,000 కోట్లకు స్వాధీనం చేసుకుంది...బ్యాంకులు రూ. 25,000 కోట్లు త్యాగం చేశాయి. ఈ కేసులో బ్యాంకులు నీళ్ళు వదులుకున్న మొత్తం 83 శాతం వరకు ఉంది. ఇది ఆరంభం మాత్రమే.  ఇటువంటి లావాదేవీలు ఇంకా అనేకం రానున్నాయి’’ అని వేంకటాచలం వివరించారు.

English Title
'Pay over bargains' basis on war basis
Related News