రేషన్ డీలర్లకు బకాయిల చెల్లింపు 

Updated By ManamSun, 08/26/2018 - 01:20
Akun
  • కమిషన్‌ను రూ. 20 నుండి రూ. 70కు పెంచిన సర్కార్

  • బకాయిల చెక్కులను అందచేసిన పౌర సరఫరాల శాఖ 

imageహైదరాబాద్ : తెలంగాణలో రేషన్ డీలర్లకు ఇటివల పెంచిన కమిషన్‌ను.. పాత బకాయిలను చెక్కుల ద్వారా పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వారికి ఈ చెక్కులను 15 ప్రభుత్వ పనిదినాల్లో డీలర్లకు అందజేయాలని సివిల్ సఫ్లై శాఖ నిర్ణయించింది. గతంలో ఉన్న డీలర్ల కమిషన్‌ను క్వింటాల్‌కు రూ. 20 నుండి రూ. 70కు పెంచింది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2015 అక్టోబర్ 1 నుండి రాష్ట్రంలో అమల్లోకి వచ్చినప్పటి నుండి 2018 ఆగస్టు 31 తేదీ వరకు ఉన్న బకాయిలను చెల్లించాలని ఉత్త్వర్వులు జారీచేసింది. పాత బకాయిలను త్వరితగతిన రేషన్ డీలర్లకు చెల్లించాలన్న అంశంపై శనివారం నాడు పౌరసరఫరాల శాఖ భవన్‌లో ఆ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ అన్ని జిల్లాల పౌరసరఫరాల అధికారులు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్లతో సమీక్షించారు. రాష్ట్రంలో 17,029 రేషన్ డీలర్లు ఉన్నారని, జిల్లాల వారీగా డీలర్ల జాబితాను సేకరించి, ఏయే డీలర్‌కు ఎంత బకాయిలు చెల్లించాలనే ప్రక్రియను తక్షణమే పూర్తి చేసి జిల్లాలకు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రజా ప్రతినిధుల సమక్షంలో పాత బకాయిలను రేషన్ డీలర్లకు చెక్కుల ద్వారా అందించాలని అన్నారు. ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న 1026 రేషన్ షాపులు, అలాగే కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయితీల్లో 1626 రేషన్ షాపులు, క్రమబద్ధీకరించిన 227 రేషన్ షాపులు, మొత్తం 2879 రేషన్ షాపుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్లను సంప్రదించి గైడ్లైన్స్ ప్రకారం షాపుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ఆహార భద్రతా కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హులైన వారికి కార్డులను జారీచేయాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, కరీంనగర్, వికారాబాద్, నల్గొండ, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరగా క్లియర్ చేయాలని ఆయా జిల్లా అధికారులను ఆదేశించారు. 

English Title
Payment of arrears to ration dealers
Related News