వాట్సాప్ చెల్లింపుల సేవపై పేమెంట్ కార్పొరేషన్ ఆరా

Updated By ManamMon, 06/04/2018 - 00:15
whatsapp

whatsappన్యూఢిల్లీ: వాట్సాప్ చెల్లింపుల సర్వీసు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగానే ఉందా, కస్టమర్ల డాటాకు భద్రత ఉందా అనే అంశాలను ఆరా తీయవలసిందిగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ)ని కోరినట్లు తెలిసింది. ఆ మొబైల్  మెసెంజర్ యాప్ సేవల స్థాయిని పెంచుకోకముందే ఆ సంగతులను పరిశీలించవలసిందిగా మంత్రిత్వ శాఖ కోరింది. వాట్సాప్ చెల్లింపులు ఆర్.బి.ఐ అనుమతులకు లోబడే పనిచేస్తున్నాయా, లావాదేవీల డాటాను అది ఎక్కడ స్టోరు చేస్తోంది, ఆ డాటాను దాని మాతృ సంస్థ ఫేస్‌బుక్ పంచుకుంటోందా వంటి విషయాలను ఆ సర్వీసు బిగ్గర్ వెర్షన్ ప్రారంభం కాకముందే పరిశీలించాలని ఎన్.పి.సి.ఐని మంత్రిత్వ శాఖ కోరినట్లు అధికారిక వర్గాలవారు తెలిపారు. పేమెంట్ సిస్టం ఆపరేటర్లు అందరూ చెల్లింపులకు సంబంధించిన డాటాను ఇండియాలో మాత్రమే నిక్షిప్త పరచాలని రిజర్వ్ బ్యాంక్ 2018 ఏప్రిల్ 5న ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా సేవలను మలచుకునేందుకు సంస్థలకు అది ఆరు నెలల గడువు ఇచ్చింది. చెల్లింపుల సేవకు చెందిన బేటా-వెర్షన్ (10 లక్షల మంది చందాదారుల వరకు) నడిపేందుకు వాట్సాప్‌కు అనుమతి ఉంది. అవెురికా కేంద్రంగా ఉన్న ఆ మెసేజింగ్ యాప్ సేవలను విస్తృతపరచి, స్థాయిని పెంచకముందే అన్ని విధానాలను పాటిస్తోందో లేదో చూడవలసిందని ఎన్.పి.సి.ఐని కోరింది. 

లావాదేవీ జరిగే సమయంలో, రెండు అంశాల ప్రమాణీకరణ చుట్టూ కూడా కొన్ని అంశాలున్నాయి. లావాదేవీ భద్రత విషయంలో కూడా వాట్సాప్ నిబంధనలను పాటిస్తోందో లేదో పరిశీలించవలసిందని ఎన్.పి.సి.ఐని మంత్రిత్వ శాఖ కోరింది. ఫేస్‌బుక్‌తో వాట్సాప్ డాటా పంచుకోవడంపై మంత్వ్ర శాఖకు కొన్ని ఆందోళనలున్నాయని ఆ వర్గాలవారు తెలిపారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, బ్రిటన్ కేంద్రంగా ఉన్న రాజకీయ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ ఎనలిటికాలు ఇటీవల డాటా బట్టబయలు విషయంలో వివాదానికి కేంద్ర బిందువుగా మారిన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ కలత చెందుతున్నట్లు తెలిసింది. లావాదేవీలు జరిగేందుకు మాత్రమే చెల్లింపుల డాటాను ఉపయోగించుకుంటున్నాం. దుర్వినియోగం కాకుండా, మోసానికి లోనుకాకుండా యూజర్లను కాపాడేందుకు, వారికి కస్టమరు మద్దతును అందించేందుకు డాటాను ఉపయోగించుకుంటున్నట్లు వాట్సాప్ తెలిపింది. ‘‘డాటాను భద్రంగా నిక్షిప్తపరుస్తున్నాం. డెబిట్ కార్డులోని 6 చివరి సంఖ్యలు, యు.పి.ఐ పి.ఐ.ఎన్  వంటి సున్నితమైన వాడకందారుని డాటాను అసలు స్టోరే చేయడం లేదు’’ అని వాట్సాప్ వెల్లడించింది. ఈ సేవకు ఫేస్‌బుక్ మౌలిక వసతులను ఉపయోగించుకుంటున్నట్లు ఈ మొబైల్ మెసేజింగ్ సంస్థ అంగీకరించింది. తన మాతృ సంస్థ పేమెంట్ సమాచారాన్ని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించుకోదని కూడా వాట్సాప్ పేర్కొంది. ‘‘వాట్సాప్‌పై మీరు చెల్లింపు జరిపినప్పుడు, ఫేస్‌బుక్‌కు చెందిన భద్రమైన చెల్లింపు వసతుల సాయంతో మేం చెల్లింపు ఆదేశాలను మా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ (పి.ఎస్.పి)కి పంపుతాం. వాట్సాప్ పేమెంట్ సమాచారాన్ని ఫేస్‌బుక్ వాణిజ్య ప్ర యోజనాలకు ఉపయోగించుకోదు. సురక్షితమైన, భద్రమైన ఉత్తమ శ్రేణి చెల్లింపు మౌలిక వసతులను ఇవ్వజూపుతున్నం దు వల్ల సర్వీస్ ప్రొవైడర్‌గా ఫేస్‌బుక్‌ను వాట్సాప్ ఉపయోగించుకుంది’’ అని వాట్సాప్ ఈ మొ త్తం వ్యవహారంపై తన స్పందనను తెలియజేసింది. 

Tags
English Title
Payment Corporation Limited on Watsap Payment Service
Related News