పాలమూరు ప్రజల వెతలు

Updated By ManamFri, 11/09/2018 - 02:24
Palamuru

imageఉమ్మడి పాలమూరు జిల్లా రాష్ట్రంలోనే పేదరికానికి చిరునామా! చుట్టూ ప్రకృతి వనరులు సంమృద్ధిగా వున్నా అభివృద్ధికి నోచుకోని దీనావస్థలో బక్కచిక్కిన బతుకులతో కాలం గడిపే ప్రజానీకం దర్శనమిచ్చే జిల్లా పక్క నుంచే కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా పాలమూరు రైతాంగం కన్నీళ్ళు తుడిచే స్థితిని కల్పించకపోవడం పాలక వర్గాలకు ప్రజలపై వున్న ప్రేమను తెలియజేస్తుంది. గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో వ్యవసాయం చేయ డం దండగ అనే అభిప్రాయాన్ని పాలకవర్గాలు పరోక్షంగా కల్పిస్తు న్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లా జనాభా 40,43,191 మంది (పురుషులు 20,46,247, స్త్రీలు 19,96,944 మంది) ఉన్నారు.

అక్షరాస్యతలో జిల్లా వెనుకబాటుకు పాలకవర్గాలే ప్రధాన కారణం. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రైవేట్‌శక్తుల చేతుల్లోకి విద్యను నెట్టేశారు. జిల్లాలో అత్యధికంగా 75% మంది వ్యవసాయంపై మాత్రమే ఆధారపడి భూమిని నమ్ముకొని జీవిస్తున్నారు. ఇక్కడి భూములు చాలా సారవంత మైనవే అయినా సరైన నీటిపారుదల సౌకర్యం లేక నెర్రెలుబారి రైత న్నలను వెక్కిరిస్తున్నాయి. భూమిలేని పేదలు, భూమి ఉండి కూడా నీటి సౌకర్యం లేక అప్పుకుప్పల్లో చిక్కుకొని గల్ఫ్ దేశాలకు వెళ్ళి గుమస్తాల చేతుల్లో మోసపోతూ స్వదేశానికి తిరిగిరాని సుదూర బతుకులను అను భవిస్తున్నారు. 

విషాదమేమిటంటే గల్ఫ్ దేశాలలో ప్రమాదంలో మరణించిన మృత దేహాలను స్వంతింటికి తీసుకురాలేని స్థితిలో పాలమూరు వలస ప్రజలు జీవనం గడపడం. ప్రభుత్వాలు ఎన్ని మారినా, పాలకులు ఎవరెన్ని హామీ లు ఇచ్చినా పాలమూరు ప్రజలు స్వావలంబనతో కూడిన జీవనం గడ పడంలో తమ వంతు కృషి చేయడంలో విఫలం అవుతున్నారు. 

భూమి తల్లిని నమ్ముకొని వ్యవసాయం చేసి జీవిస్తున్న ప్రజల భూమిని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తంimage చేస్తున్నాయి పాల కవర్గాలు. దీంతో రైతాంగం భూమిలేని అనాథలవుతున్నారు. ప్రభుత్వాలు కంపెనీ లకు భూ సమీకరణ చేసే సమయంలో, కొండంత హామీలిచ్చి తీరా చూస్తే నేడు అదే కంపెనీలలో రోజువారీ కూలీలుగా మారి తమ భూమిలో తామే పరాయి వాళ్ళుగా, కూలీలుగా మారే స్థితిని పాలకవర్గాలు పెట్టు బడిదారి ఆర్థిక వ్యవస్థలో భాగంగా కల్పించాయి. చదువుకున్న స్థానిక యువతకు ఉద్యోగాలిస్తామని తర్వాత మోసంచేసి ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు చెందిన యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. తత్ఫలితంగా పాలమూరు యువత ఇటు వ్యవసాయం చేసుకొనుటకు భూమి లేక, అటు ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక పట్టణాలలో బిచ్చగాళ్ళుగా మారు తున్నారు. దేశంలోని ప్రముఖ నగరాలలో కూడా పాలమూరు కార్మికులు, వలస కూలీలు కనిపిస్తున్నారు. నిజంగా పాలమూరు ప్రజల గోడు ప్రపం చంలో ఏ దేశంలోనైనా చెమట రూపంలో ప్రవహిస్తూనే ఉంది.

పాలమూరు జిల్లా పారిశ్రామికవాడగా చెప్పుకుంటున్న ప్రాంతంలో కొత్తూరు, షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లోనే చిన్న పెద్దవి కలిపి దాదాపు 300లకు పైగా కంపెనీలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఐరన్ కంపె నీలు, హైదరాబాద్ సిలిండర్ కంపెనీలు, ఆల్‌విన్ టెక్స్‌టైల్స్, కర్నూల్ సిలిండర్ కంపెనీ, చాక్‌లెట్ కంపెనీలు, హెచ్‌బిఎల్ బ్యాటరీ కంపెనీలు మొదలైనవి. కొత్తూరు నుంచి మూసాపేట జాతీయ రహదారికి ఇరువైపు లా దర్శనమిస్తాయి. మరికొన్ని కంపెనీలు అలంపూర్ వరకు విస్తరించి వున్నాయి. జడ్చర్ల సమీపంలో ఉన్న ఫార్మసీ కంపెనీలు, పోలేపల్లిలో దాదాపు 1289 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా గుంజు కున్నాయి. మానవత్వం లేని విషయం ఏమిటంటే పోలేపల్లి కుటుంబీ కులు మరణించిన తర్వాత మృత దేహాలను బొందపెట్టడానికి కూడా స్థలాన్ని మిగిల్చలేదు. భూమిని కోల్పోయిన కుటుంబాలలో నిరుద్యోగ యువతకు కనీసం ఉద్యోగం కూడా కల్పించలేక పోయారు. స్థానిక యువ తను వదిలేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువతకు ఉద్యోగావ కాశాలు కల్పించారు. ఈ దుస్థితి కొత్తూరు నుంచి మూసాపేట ప్రాంతాల్లో ఉన్న అన్ని కంపెనీలలో కూడా కన్పిస్తోంది. ఇక్కడి యువత మాత్రం రోజువారి కూలీలుగా 200-300 రూపాయలకే తమ చెమటను ధార పోస్తున్నారు.

బయటి ప్రాంతం నుంచి వచ్చిన కార్మికులకు కూడా భద్రత కలిగిన జీవితం లేదు, వారికి కూడా అవే పరిస్థితులు. ఏ ఒక్క కంపెనీలో సైతం పర్మినెంట్ లేబర్ లేకపోవడం పెట్టుబడిదారుల దోపిడి వ్యవస్థకు నిద ర్శనం. కార్మికులంతా రోజుకు 12 గంటలకు పైగా పనిచేస్తున్నవారే. ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే యాజమాన్యం నయానా భయానా ఇచ్చి చేతులను దులుపుకుంటోంది. ఒకవేళ కంపెనీలో ఏదైనా ప్రమాదంలో కార్మికులు మరణిస్తే చిన్నమొత్తాన్ని ఇచ్చి పంపిస్తుంది. గతంలో ఐరన్ కంపెనీలో కార్మికుడు మరణిస్తే కంపెనీ యాజమాన్యంగా ని, ప్రభుత్వాలు గాని చేసిన సహాయం, శూన్యమనే చెప్పాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటు వంటి కార్మికులు ఒకసారి వారి ఇండ్ల నుంచి ఇక్కడికి వస్తే తిరిగి 6 నెలలకో, సంవత్సరానికో వెళ్తారు. కార్మికులకు స్థానికంగా పనిచేస్తున్న కంపెనీ పరిసర ప్రాంతాల్లోనే నివాసస్థలాలు కేటాయించి తాత్కాలికంగా వసతిని ఏర్పాటు చేసినా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి ఇండ్లు పశువుల దొడ్లను గుర్తుకు తెస్తాయంటే వారు ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో వున్నారో అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తూ ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడి కంపెనీకి వెళ్ళకపోతే ఆ రోజు కూలీని నెలసరి వేతనం నుంచి తొలగించే పద్ధతి కూడా వుంది. 
    
ఇక్కడ కంపెనీలో ప్రమాద బీమా సౌకర్యం లేదు. అలాగే ఉద్యోగ భద్రత లేదు. ఎప్పుడైనా ప్రభుత్వ తనిఖీ అధికారులు కంపెనీలను సందర్శించినప్పుడు యాజమాన్యంతో మాట్లాడుకొని పోతారే తప్ప కార్మి కుల హక్కులు అమలయ్యే విధానం వారికి కల్పించే వసతులు, వారికి ప్రభుత్వ చట్టాల ద్వారా లభించే రాయితీల గురించి మాట్లాడిన సంద ర్భాలు లేవు. ఒక్కొక్క కంపెనీలో 100 నుంచి 600 మంది వరకు కార్మికులు పనిచేస్తుంటారు. ఏదైనా విషయంలో యాజమాన్యంతో మా ట్లాడి తమ సమస్యల సాధనకై ప్రశ్నిస్తే ప్రశ్నించే గొంతుక మరుసటి రోజు పనిలోకి రావటానికి వీలులేకుండా యాజమాన్య నిరంకుశత్వం బయట పడుతుంది. కాని తప్పని పరిస్థితుల మధ్య దాదాపు 20-30 కిలోమీటర్ల దూరం నుంచి కార్మికులు కూలీకి వచ్చే పరిస్థితులు పాలకవర్గాలు కల్పించాయి. బయట ప్రతి బూర్జువా రాజకీయ పార్టీకి అనుబంధ కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు నేరుగా యాజమాన్యంతో తమ లాబీయింగ్‌లు చేసుకుంటున్నాయి తప్ప ఏ ఒక్క రోజు కూడా కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కంపెనీలు వెదజల్లే విషపదార్థాలు, విష వాయువుల వలన అక్కడి పర్యావరణం ఎలా కలుషితం అయినదో కార్మికుల జీవితాలు కూడా అలాగే మసకబారి అనారోగ్యంతో మరణం అంచున దోబూచులాడుతున్నాయి. 

ప్రపంచ కార్మిక వర్గం నేర్పిన గుణపాఠం మనకళ్ళ ముందు కన్పిస్తుంది. ప్రశ్నించే గొంతులే మూగబోతే దోపిడి వ్యవస్థ రాజ్య మేలు తోంది. అంతిమంగా పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్నత స్థితికి చేరుకుంటుంది. చేరుకుంది కూడా. ఇప్పటికైనా పాలకవర్గాలు స్పందించి కార్మికుల సంక్షే మం కోసం కృషిచేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. కార్మిక హక్కులు, చట్టాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, బుద్ధిజీవులు కార్మికుల శ్రమ వైపు నిలబడాలి. తమనెత్తిటిని ఇంధనంగా మార్చి ఉత్పత్తిలో భాగం అవు తున్న కార్మికులకు న్యాయం జరిగేంత వరకు ప్రశ్నించాలి. పోరాట మార్గాలు ఎంచుకోవాలి. అంతిమంగా కార్మికవర్గ దృక్ఫథ రాజ్య నిర్మా ణంలో భాగస్వాములం కావాలి. ప్రపంచ జనాభా కార్మికుల శ్రమతో ఉత్పన్నమైన ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. కావున వారివైపు నిలబడకపోవడం అమానవీయ కోణమే అవుతుంది.

- శంకర్

English Title
people of Palamuru
Related News