తెలంగాణపైనా పెథాయ్ తుఫాన్ ప్రభావం

Pethai cyclone, Telangana state, Heavy rains, Cyclone effect

హైదరాబాద్: ఏపీని వణికిస్తోన్న పెథాయ్ తుఫాను తెలంగాణ రాష్ట్రంపై కూడా ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగానలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావారణ శాఖ వెల్లడించింది. రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.  పెథాయ్‌ తుపాను ప్రభావంతో తెలంగాణలో ఈనెల 18న మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వైకే రెడ్డి తెలిపారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాకినాడ తీరాన్ని దాటే క్రమంలో బలహీనపడే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 

దీని ప్రభావం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తునా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో ఇప్పటికే ఏడు జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరానికి అలెర్ట్ ప్రకటించారు. పెథాయ్ తుఫాన్ తీరం దాటే సమయంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు