చేయి చేసుకున్నారు, ఫోన్ లాక్కున్నారు..

Updated By ManamSat, 09/08/2018 - 16:09
Manhandled, Phone Snatched Says Yogendra Yadav, Detained In Tamil Nadu
  • తమిళనాడులో యోగేంద్ర యాదవ్‌ నిర్బంధం

Manhandled, Phone Snatched, Says Yogendra Yadav, Detained In Tamil Nadu

చెన్నై : సమాజ్ ఇండియా పార్టీ చీఫ్, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్‌కు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది. తిరువణ్నామలై విమానాశ్రయంలో యోగేంద్ర యాదవ్‌తో పాటు ఆయన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూములు కోల్పోయిన రైతులు నిరసనకు మద్దతుగా వెళుతున్న ఆయనను పోలీసులు మధ్యలోని నిలిపివేశారు.

ఈ నేపథ్యంలో ఎనిమిది లైన్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా మాట్లాడుతున్న.. తనపట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించినట్లు యోగేంద్ర యాదవ్ తెలిపారు. తమ సెల్‌ఫోన్లు లాక్కోవడమే కాకుండా బలవంతంగా పోలీస్ వాహనంలోకి తోసేశారని, అదేమని ప్రశ్నించినందుకు చేయి చేసుకున్నారని ఆయన ఆరోపించారు.

ఆ తర్వాత తమను చెంగమ్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించినట్లు తెలిపారు. ఈ మేరకు యోగేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు. అయితే యోగేంద్ర యాదవ్ ఆరోపణలను పోలీసులు ఖండించారు.  రైతులను కలిసేందుకు అనుమతి లేనందునే యోగేంద్ర యాదవ్‌ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకూడదనే వారిని అక్కడ నుంచి తరలించినట్లు చెప్పారు. 

కాగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత యోగేంద్ర యాదవ్ సమాజ్ ఇండియా పార్టీని స్థాపించారు. అలాగే  గత ఏడాది నుంచి జై కిసాన్ ఉద్యమం ప్రారంభించి అప్పటి నుంచి రైతుల హక్కుల కోసం పోరాడుతున్నారు.

English Title
Phone snatched, manhandled: Yogendra Yadav
Related News