ప్లే ఆఫ్ రేస్

Updated By ManamWed, 05/16/2018 - 02:20
mubai indians
  • రెండు బెర్తులు.. ఐదు జట్లు   ప్రతీ మ్యాచ్ అగ్ని పరీక్షే!

ఐపీఎల్‌లో ప్లే ఆఫ్ కంటే ముందు... అసలు సిసలు మజా మొదలైంది. నాలుగు ప్లే ఆఫ్ బెర్తుల్లో ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు దాదాపు తమ స్థానాలను ఖాయం చేసుకోగా... మిగతా రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీలో ఉన్నాయి. దీంతో ఈ ఐపీఎల్‌లో మిగతా లీగ్ మ్యాచ్‌లు  మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ వేసవి చివర్లో ప్రేక్షకులకు మరింత వినోదాన్నందించబోతున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న పాయింట్ల పట్టికను పరిశీలిస్తే  2018 ఐపీఎల్‌లో ఢిల్లీ కథ ముగిసింది. ఈ మూడు జట్లు ...కింగ్స్ లెవెన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్  12 పాయింట్లతో సమ ఉజ్జీలుగా నిలిచాయి. మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజ్స్ బెంగళూరు 10 పాయింట్లతో ఉన్నాయి. టోర్నమెంట్ ఆరంభంలో చెత్తగా ఆడిన ముంబై, రాజస్థాన్, బెంగళూరు పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీపడుతూ వచ్చినా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దీంతో  ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఈ కారణంగా లీగ్ మ్యాచ్‌ల చివరి వరకూ ప్లేఆఫ్  బెర్తులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో (కోల్‌కతా నైట్ రైడర్స్- రాజస్థాన్ రాయల్స్, మంగళవారం నాటి మ్యాచ్‌కు ముందు) ఏ జట్టు ప్లే ఆఫ్  చేరే అవకాశముంది.. ప్లే ఆఫ్ చేరాలంటే ఏ జట్టు ఏం చేయాలి..?


కోల్‌కతా నైట్‌రైడర్స్ (12 పాయింట్లు)dinesh
ఒకప్పటి చాంపియన్ నైట్ రైడర్స్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ముంబై చేతిలో  దెబ్బమీద దెబ్బ తిన్నాక పంజాబ్‌పై భారీ స్కోరు (245/6) చేసి గెలుపొంది మళ్లీ పుంజుకుంది. రాజస్థాన్‌పై గెలిస్తే.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువవుతుంది. ఓడినా చివరి మ్యాచ్‌ల్లో తప్పని సరిగా గెలిస్తే  ప్లే ఆఫ్‌కు  చేరే అవకాశాలున్నాయి. అయితే మిగతా జట్ల గెలుపోటములూ ఈ జట్టును ప్లే ఆఫ్‌కు చేర్చే అంశంపై ప్రభావం చూపుతాయి.

రాజస్థాన్ రాయల్స్ (12 పాయింట్లు)
rahaneటోర్నీ ఆరంభంలో చెత్తగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్ రేసులోకి  దూసుకొచ్చింది. కోల్‌కతాతో జరిగే  కీలక మ్యాచ్‌తో రాజస్థాన్ జట్టు  అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే చివరి మ్యాచ్ వరకూ రాజస్థాన్‌కు ప్లే  ఆఫ్ పోరాటం తప్పదు.

కింగ్స్ లెవెన్ పంజాబ్ (12 పాయింట్లు)
బెంగళూరుతో  సోమవారం జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడి  పంజాబ్ జట్టు డేంజర్‌లో పడింది. వరుస ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాన్ని మరింత క్లిష్టం చేసుకున్న పంజాబ్ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికు పడిపోయింది. ఇంకో రెండు మ్యాచ్‌లాడాల్సి ఉన్నందున ఈ జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకమే. బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌తో పాటు  చివరి మ్యాచ్‌ను  చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడాల్సి ఉంది.

ముంబై ఇండియన్స్ (10 పాయింట్లు)
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై చిత్తుగా ఓడిపోయిన ముంబైకి ఇక ప్రతి మ్యాచ్ కీలకమే.. బుధవారం  పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడితే ఇక టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే.. పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌తో పాటు ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ముంబై గెలిస్తే  ముంబై ముందుకెళుతుంది.  

rcbరాయల్ చాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు)
ఐపీఎల్‌లో ఆడుతున్న ఎనిమిది జట్లలో ప్రస్తుతం ఏడో స్థానంలో  ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు విజయాలు సాధించి ప్లే ఆఫ్ రేస్‌లో  తామూ ఉన్నామని నిరూపించింది. ఆ కలను నెరవేర్చుకోవాలంటే మిగతా రెండు మ్యాచ్‌ల్లో బెంగళూరు తప్పక గెలవాల్సి ఉంది. పంజాబ్‌ను పది వికెట్ల తేడాతో ఓడించి మెరుగైన రన్‌రేట్‌ను సంపాదించిన బెంగళూరు మిగతా మ్యాచ్‌ల్లోనూ అదే ఆటను ప్రదర్శిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకునే అవకాశం  ఉంది.

English Title
play off race
Related News