రైతుల ఆదాయం రెండింతలు చేస్తాం: మోదీ

Updated By ManamSun, 07/15/2018 - 15:03
PM Narendra Modi,  key projects, UP's Mirzapur, Mirzapur Medical College
  • ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని రెండు రోజుల పర్యటన

  • యూపీలో కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

  • బన్‌సార్ బ్రిడ్జి ప్రారంభోత్సవం, మెడికల్ కాలేజీకి శంకుస్థాపన 

  • మీర్జాపూర్‌లో బహిరంగ ర్యాలీలో మోదీ ప్రసంగం

PM Narendra Modi,  key projects, UP's Mirzapur, Mirzapur Medical Collegeమీర్జాపూర్(ఉత్తరప్రదేశ్): ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఉత్తరప్రదేశ్‌లో కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. యూపీలోని బన్‌సాగర్ కేనల్ ప్రాజెక్టును తొలుత ప్రారంభించిన ఆయన.. మీర్జాపూర్‌లోని మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. మీర్జాపూర్, వారణాసి మధ్య అనుసంధానిస్తూ గంగా నదిపై బ్రడ్జిని ప్రారంభించారు. అలాగే (పీఎంబీజేపీ) పథకం కింద 108 జన్ ఆశాధి కేంద్రాలను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం మీర్జాపూర్‌లో బహిరంగ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రధానంగా రైతుల గురించే ప్రస్తావించారు. దేశంలోని రైతుల శ్రేయస్సు కోసమే తమ ప్రభుత్వం రాత్రింబవళ్లూ కష్టపడుతోందని అన్నారు. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు.

రైతుల ఆదాయం అంతకు రెండింతలు కావాలంటే ప్రభుత్వ పథకాలను సద్వినియోగపర్చుకోవాలని కోరారు. ధనిక, పేదరికానికి మధ్య వారదిని నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామని, త్వరలోనే ఆ రోజులును ప్రతిఒక్కరూ చూస్తారని చెప్పారు. బన్ సాగర్ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలోని ప్రజల కలలను సాకారం చేసుకోవచ్చున్నారు. 70ఏళ్ల క్రితం 300 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. ఈ రోజు రూ.3,500 కోట్ల ఖర్చు పెట్టిన తరువాత మాత్రమే పూర్తి అయిందని మోదీ చెప్పారు. రైతుల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తున్న వారంతా తమ పాలనలో ప్రాజెక్టులను ఎందుకు అసంపూర్తిగా ఉంచారో ఈరోజు ప్రజలంతా గట్టిగా అడగాల్సి ఉందన్నారు.    

English Title
PM Modi launches key projects in UP's Mirzapur
Related News