నేపాల్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

Updated By ManamThu, 08/30/2018 - 08:35
PM Narendra Modi, Nepal, BIMSTEC Summit, VVIP guests
  • రెండు రోజుల పాటు 4వ బిమ్ స్టెక్ సదస్సు 

  • పాల్గొనున్న వివిధ దేశాల ప్రధానులు, వివిఐపీలు

PM Narendra Modi, Nepal, BIMSTEC Summit, VVIP guestsఖాట్మాండు: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నేపాల్ పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పాటు నేపాల్‌లో పర్యటించనున్న మోదీ.. 4వ బిమ్ స్టెక్ సదస్సులో పాల్గొననున్నారు. ప్రధాని హోదాలో మోదీ నేపాల్‌లో పర్యటించడం ఇది నాల్గోసారి. ఈ రోజు ఉదయమే ప్రత్యేక విమానంలో నేపాల్‌ పర్యటనకు బయల్దేరిన ఆయన ఉదయం 8 గంటల ప్రాంతంలో త్రిభువన్ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకోనున్నారు. అలాగే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వజీద్, థాయి ప్రధాని ప్రయూత్ చాన్-ఒ-ఛా ఇరువురు కూడా ఖాట్మాండుకు ఉదయం 10.15లకు చేరుకొనే అవకాశం ఉంది.

ఖాట్మాండులో జరుగనున్న 4వ బిమ్ స్టెక్ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి  వివిఐపీలు వస్తున్న నేపథ్యంలో నేపాల్ అంతర్జాతీయ విమానాశ్రయం, త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాలను రెండెన్నర గంటల పాటు మూసివేయనున్నట్టు ఏయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రూమ్ (ఏటీఆర్) పేర్కొంది. నేపాల్ స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో విమానాశ్రయంలో విమానాల సర్వీసులను నిలిపివేశారు. ఇప్పటికే నేపాల్‌లో భారీ భద్రతను కట్టదిట్టం చేశారు. 

English Title
PM Narendra Modi to arrive in Nepal for BIMSTEC Summit
Related News