లోపాలను ఎత్తిచూపింది : ఒట్టిస్ గిబ్సన్

Updated By ManamThu, 02/15/2018 - 01:09
gibson

gibsonపోర్ట్ ఎలిజబెత్: మానసికంగా క్రుంగిపోయిన తమ జట్టులో దాచేందుకు ఏదీ లేదని.. తమలోని లోపాల ను టీమిండియా ఎత్తి చూపిందని సౌతాఫ్రికా జట్టు కోచ్ ఒట్టిస్ గిబ్సన్ అన్నారు. మంగళవారమిక్కడ జరిగిన ఐదో వన్డేలో టీమిండి  యా 73 పరుగులతో సౌతాఫ్రికాను సొంత గడ్డపై ఓడించి తొలిసారి సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో ఆరు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో కోహ్లీ సేన 4-1తో నిలిచింది. ‘ముగ్గురు అత్యుత్తమ ఆటగాళ్లు జట్టుకు దూరమైతే.. ఆ జట్టుకు తప్పక ఇబ్బందులకు గురవుతుంది. అందులోనూ టీమిండియా లాంటి బలమైన జట్టుపై గెలవడం చాలా కష్టం. కార ణాలు వెతకకుండా అత్యుత్తమ ప్రతిభ కనబరిచేందుకు ప్రయ త్నించమని ముందుగానే వాళ్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో చెప్పాను. ఎందు కంటే మేము పిల్లలం కాదు. అయితే ఈ సిరీస్ ఓటమి మాకు ఎన్నో ఆలోచనలను రేకెత్తిం చింది. నిజానికి మేము వచ్చే ఏడాది వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టాం. కానీ ఇటువంటి జట్టుతో వరల్డ్ కప్‌లో పాల్గొనలేం’ అని గిబ్సన్ అన్నారు. 
 

English Title
Points out the mistakes: Gibson
Related News