యాంకర్ అనసూయపై పోలీసు కేసు

Updated By ManamTue, 02/06/2018 - 13:28
police case on Jabardasth Anchor anasuya

police case on Anasuya

ప్రముఖ తెలుగు యాంకర్ అనసూయకు చిర్రెత్తుకొచ్చింది.. సహనం కోల్పోయిన యాంకర్.. సెల్ఫీ దిగడానికొచ్చిన బాలుడి ఫోన్ లాక్కోని నేలకేసి కొట్టింది. ముచ్చటపడి మా పిల్లాడు అనసూయతో సెల్ఫీ దిగడానికి వెళితే ఇలా ఫోన్ నేలకేసి కొట్టిందని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అసలేం జరిగింది..
మంగళవారం ఉదయం అనసూయ తన వ్యక్తిగత పనిమీద నగరంలోని తార్నాకకు కారులో వెళ్లింది. తిరిగొస్తుండగా మధ్యలో కారు ఆపి ఎవరితోనే ఆమె మాట్లాడుతోంది. అటుగా పిల్లాడు, అతని అమ్మ వెళ్తున్నారు. ఇంతలో అనసూయను టీవీల్లో పలుమార్లు చూసిన ఆ బాలుడు.. ప్రత్యక్షంగా యాంకర్ రోడ్డు మీద తారసపడటంతో టక్కున తన అమ్మ దగ్గరున్న స్మార్ట్ ఫోన్ లాక్కొని అక్కడికి పరుగెత్తికెళ్లాడు. అంతలోనే బాధగా యాంకర్ దగ్గర్నుంచి అమ్మదగ్గరికొచ్చేశాడు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమోగానీ ఫోన్ మాత్రం బద్ధలైంది. ఈ విషయం తన అమ్మతో స్కూల్ పిల్లాడు చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. వెంటనే అనసూయ దగ్గరికెళ్లిన మహిళ వాగ్వాదానికి దిగింది. అనసూయ మాత్రం మహిళ మాటలకు ఏ మాత్రం తగ్గకుండా రుబాబు చేస్తూ కారెక్కి వెళ్లిపోయిందని మీడియాకు తెలిపింది. అయితే అనసూయ ఇలా చేయడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


       ఫోన్ పగలగొట్టిన ఘటనపై అనసూయ స్పందన
 

పోలీసు కేసు నమోదు..
అనసూయ ఫోన్ పగలకొట్టడంతో తీవ్ర ఆవేశానిలోనైన పిల్లాడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడిని అనసూయ దుర్భాషలాడుతూ ఫోన్ ఇలా పగలకొట్టిందని మహిళ ఉస్మానియా పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆ మహిళ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అనసూయను పీఎస్‌కు పిలిపించి విచారిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే.

English Title
Police Case Files On Jabardasth Anchor anasuya
Related News