జ్యోతికపై పోలీసులకు ఫిర్యాదు

Updated By ManamSat, 02/17/2018 - 14:27
Jyothika
jyothika

సినీ నటి జ్యోతికపై హిందూ మక్కళ్‌ కట్చి నేతలు చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో  ఫిర్యాదు చేశారు. బాలా దర్శకత్వంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘నాచియార్’ శుక్రవారం విడుదలయ్యింది‌. ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ గతంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో కొన్ని సంభాషణలను ఇప్పటికే చిత్ర వర్గాలు తొలగించాయి. 

అయినా హిందూ మక్కల్ కట్చి శాంతించడం లేదు. ఈ చిత్రంలో సంభాషణలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ హిందూ మక్కళ్‌ కట్చి నేతలు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ ఆలయాలకు వ్యతిరేకంగా జ్యోతిక చెప్పే డైలాగ్‌ను తొలగించాలని, దీనివల్ల మతపరమైన సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అభ్యంతరం చెప్పారు. ఇందుకు బాధ్యులైన దర్శకుడు బాలా, నటి జ్యోతికలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. 

English Title
Police complaint given on Jyothika, Bala
Related News