జనసేన సభలో పోలీసుల లాఠీచార్జ్

Updated By ManamWed, 03/14/2018 - 16:40
JanaSena Party Formation Day Maha Sabha

 Police Lathi Charge on Pawan Kalyan Fans, Janasena Activists at Guntur

గుంటూరు: జిల్లాలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సభలో కార్యకర్తలు అదుపు తప్పారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఒక్కసారిగా మీడియా వాహనాలపైకి కార్యకర్తలు దూసుకొచ్చారు. మీడియా ప్రతినిధులు భద్రతా సిబ్బందికి తెలియజేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కార్యకర్తలను, నాయకులను పోలీసులు నిలువరించలేకపోయారు. దీంతో స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

కొందరు కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు కూడా రువ్వినట్లు సమాచారం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది చర్యలు తీసుకున్నప్పటికీ  నిర్వాహకుల లోపంతో ఈ ఘటన జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అసలు ఎటు నుంచి సభకు వెళ్లాలో కార్యకర్తలకు, సభకు వచ్చిన నేతలకు తెలియట్లేదు. దీంతో కార్యకర్తల్లో కాసింత ఆందోళన సైతం నెలకొంది.

English Title
Police Lathi Charge on Pawan Kalyan Fans, Janasena Activists at Guntur
Related News