అర్ధరాత్రి పోలీసుల హైడ్రామా.. జీపీ రెడ్డి ఇంట్లో సోదాలు

Updated By ManamFri, 11/09/2018 - 09:21
GP Reddy
  •  హైదారాబాద్‌లో అర్ధరాత్రి పోలీసుల హల్‌చల్

  •  ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి ఇంట్లో సోదాలు

  •  లగడపాటి ఎంట్రీతో వెనక్కి తిరిగిన పోలీసులు

  • ​​​​​​ ​భూవివాదంలో జీపీ రెడ్డి బంధువులకు, ఐపీఎస్‌కు విబేధాలు

GP Reddyహైదరబాద్: నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి ఇంట్లో అర్ధరాత్రి పోలీసుల సోదాలు కలకలం సృష్టించాయి. వెస్ట్ జోన్ డీజీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు జీపీ రెడ్డి ఇంటికి వెళ్లారు. వారెంట్ లేకుండానే ఇంట్లోకి ప్రవేశించారు. సివిల్ కేసుకు సంబంధించిన విచారణ అంటూ జీపీ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.

విషయం తెలుసుకున్న జీపీ రెడ్డి స్నేహితుడు, మాజీ ఎంపీ లగడపాటి అక్కడకు చేరుకోని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్చ్ వారెంట్ చూపించాలంటూ పోలీసులను నిలదీశాడు. వారెంట్ లేకుండా ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తారని.. దీనిపై ఎన్నికల కమిషన్‌కు, గవర్నర్‌ను ఫిర్యాదు చేస్తానని లగడపాటి అన్నారు. ఐపీఎస్ అధికారి నాగిరెడ్డికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే ఓ భూ వివాదంలో జీపీ రెడ్డికి సంబంధించిన బంధువులు, ఐపీఎస్ నాగిరెడ్డి మధ్య వివాదాలు నడుస్తుండగా.. ఈ వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని జీపీ రెడ్డి అన్నారు. పోలీసులు కావాలనే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆ స్థలానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని.. దాన్ని ప్రభుత్వానికి ఇచ్చినా తనకేమీ అభ్యంతరం లేదని జీపీ రెడ్డి అన్నారు.

Lagadapati

 

English Title
Police raids in GP Reddy house at mid night
Related News