‘ఆధార్’ ఆధారంగా ‘పోలీస్ రాజ్యం’

Updated By ManamWed, 08/01/2018 - 02:06
Adhar

Adharఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సెక్రెటేరియట్ మొత్తం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కార్యాలయం వరకు  పెద్దపెద్ద గోడలతో నిర్మితమై కిటికీలు లేకుండా స్క్రీన్‌లతో నిండివుంటుంది. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది జనాభాకు చెందిన 43 లక్షలమంది వ్యక్తిగత వివరాలన్నీ ఈ స్క్రీన్లపై కనిపిస్తూ ఉంటాయి. ఈ 43 లక్షలమంది ఇళ్ల వివరాలు సహా వారు వాడే మందులు, తీసుకునే ఆహారం, చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో చేసే వ్యాఖ్యలు తదితర వ్యక్తిగత వివరాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకునే వ్యవస్థ ఫీడ్ చేస్తుంటుంది. ఈ వ్యవస్థనే ఎప్పటికప్పుడు ‘ప్ర స్తుతం ఉన్న స్థానం తెలుసుకునే వ్యవస్థ’ (global positioning) అంటారు. ఈ వ్యవస్థ ఫీడ్ చేసే వివరాల ద్వారా ప్రతి వ్యక్తి ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తున్నాడో స్పష్టంగా తెలిసిపోతుంది. ఇందుకోసం ప్రతి ఇంట్లోనూ కొన్ని కెవేురాలను (వారి ఇష్టాయిష్టాలపైనే) బిగిస్తారు. తద్వారా వారి కులం, ఉపకులం, మతం, పిల్లలు అందుకుంటున్న విద్యార్థి ఉపకారవేతనాలు, వృద్ధాప్య పించన్లు, రాష్ట్రంలో అంబులెన్స్‌ల సంచారం, వారి ఆధార్ నెంబర్ సహా ఏ అంశంలోనైనా వ్యక్తిగత వివరాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది భద్రతా కెవేురాల ఏర్పాటు ద్వారా తెలుసుకోవచ్చు. 

‘సూర్యోదయ ఆంధ్రప్రదేశ్-2022’ (sunrise AP 2022) కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం మేరకు, ‘ఈ-ప్రగతి’ లో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి వివరాలు ఈ స్క్రీన్‌ల ద్వారా తెలుసుకునే వీలుంది. వ్యక్తుల ఆధార్ నెంబర్ ద్వారా ప్రతి వ్యక్తి ఈ-కేవైసీని తెలుసుకునే వీలుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్‌టీజీసీ)లోని కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటుచేసిన డిస్‌ప్లే బోర్డులపై ఈ వ్యక్తిగత వివరాలు నమోదవుతాయి. ఈ సెంటర్‌లో ఉన్న 40 కంప్యూటర్ల ముందు కూర్చున్న వ్యక్తులు తదేకదృష్టితో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, సామర్థ్యాన్ని పెంపొందించడం, వ్యర్థాలను నియంత్రిం చడం, లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందే విషయంలో నిర్వహణ తీరుతెన్నులను నిరంతరం గమనిస్తుంటారు. ఒకపక్క ఆధార్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు ఆలోచిస్తుండగా మరోపక్క శ్రీకృష్ణ కమిషన్ భారత్‌లో నిర్దిష్ట పరిధిలో వివరాల భద్రతా చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. అయినప్పటికీ సాధ్యమైనంత మంది వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు రాష్ట్రప్రభుత్వాలు ఉత్సాహపడుతున్నా యి. ఈ అంశంలో డాటాబేస్ సేకరణ అంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. చాలా రాష్ట్రాలు ఇదే కార్యక్రమంలో ఉండగా ఏపీ మాత్రం సంపూర్ణంగా సఫలీకృతమైంది. ప్రజల్లో గందరగోళం, ఆందోళన, అంశంలో దాగున్న సంక్లిష్టత కలిగిన ఇలాంటి ప్రధాన అంశంపై ప్రజాభిప్రాయ సేకరణగానీ, ఇందుకు సంబంధించి చర్చలుగానీ జరగలేదు. ఆధార్ ద్వారా ఈ-కేవైసీని తెలుసుకోవడం వల్ల ప్రజలను గుర్తించవచ్చు. ఇందులో ఉన్న అసలు ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ‘ఈ ప్రయత్నం అసలు ఉద్దేశానికి ఇదెంత మాత్రం సరిపోదు...’ అని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ సెంటర్ ఫర్ డాటా సైన్స్ ప్రొఫెసర్ వసంత్ ధర్ వ్యాఖ్యానించారు. ఈ విధంగా వ్యక్తిగత వివరాల సేకరణ వల్ల ఆ వ్యక్తికి ఎలాంటి అపాయం ఉండదని స్పష్టం కావలసి ఉంటుందని ఆయన చెప్పారు. 

2016లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాసాధికార సర్వే లేదా స్మార్ట్‌పల్స్ సర్వేను నిర్వహించారు. ప్రతినిత్యం అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్‌తో కూడిన టాబ్‌ను తీసుకుని ఇంటింటికి ప్రభుత్వ సర్వేయర్లు తిరిగి వ్యక్తిగత సామాజిక ఆర్థిక వివరాలు వేలిముద్ర సహా సేకరిస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ ఈ-ప్రగతి పోర్టల్‌కు అప్‌లోడ్ చేస్తారు. తరువాత ఈ వివరాలు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరతాయి. ఇంతవరకు 43 లక్షల మంది వివరాలు ఈ- ప్రగతిలో నిక్షిప్తమై ఉన్నాయి. అందులో 33 లక్షల మంది ఆధార్ ఆధారిత ఈకేవైసీ వివరాల పరిశీలన పూర్తయింది. దీనిపై స్పందించేందుకు సీనియర్ అధికారులు అందుబాటులో లేరు. క్షేత్రస్థాయిలో (internet of things) పరికరాల ద్వారా సేకరించిన భూగర్భ జలాల స్థితి, ఉష్ణోగ్రతల వివరాలు, విద్య, లైటింగ్, మరెన్నో అంశాల వివరాలు వివిధ శాఖల నుంచి సేకరించినవి మా వద్ద ఉన్నా’యని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ అధికారులు తెలిపారు. పగటిపూట వీధిలైట్లు వెలుగుతున్న సంగతి కూడా మాకు తెలిసిపోతుందని వారు చెప్పారు. పారదర్శకత, వ్యక్తిగతగోప్యత హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని సెంటర్ ఫర్ ఇంటర్‌నెట్ అండ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ అబ్రహాం అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కశాఖా ఆన్‌లైన్ డాష్‌బోర్డులు రూపొందించుకోవలసిన అవసరాన్ని ఆయన ప్రశ్నించారు. దీనివల్ల వ్యక్తిగత వివరాలను తెలుసుకోవడం ఏ అధికారికైనా చాలా సులువని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో ఈ డాష్‌బోర్టులు ప్రజల కోసం తెరిచే ఉంటున్నాయి. ఇది భద్రతకు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి ఈ విధానంలో నాలుగువేల కెవెురాలు పనిచేస్తున్నాయి. త్వరలో మరో 20వేల కెవేురాలను ఏ ర్పాటు చేయనున్నామని ఇంజినీర్లు తెలిపారు. ప్రస్తుతం తాము నే రసంబంధిత సమాచారాన్ని అనుసంధానం చేస్తున్నామని వారు చెప్పారు. ఇవన్నీ కేవలం నిపుణుల పర్యవేక్షణలోనే పనిచేయడం లేదు. ప్రైవేట్ వ్యక్తులు ఇళ్లల్లో సెలవు రోజుల్లో పర్యవేక్షించేందుకు పోలీసు శాఖ కెవెురాలను లాక్‌డ్ హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఇవి వాస్తవానికి ప్రోగ్రామ్ కార్యక్రమం ద్వారా బిగిస్తున్నారు. ‘సెలవులకు ఎక్కడికైనా వెళ్తుంటే ఆ విషయాన్ని ఫోన్ ద్వారా తెలియజేస్తే వా ళ్ళే కెవెురాలను ఆయా ఇళ్లల్లో ఏర్పాటుచేస్తారని ఇంజినీర్ ఒకరు తెలిపారు. ఇవి రాత్రులందు కూడా పనిచేస్తాయని, ఇంటి యుజమాని లేనపుడు ఎవరైనా ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తుందని ఆయన చెప్పారు. 4.5 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు ప్రస్తుతం ప్రభుత్వ నిఘాలో ఉన్నాయి. ఆధార్ వివరాల అంశంలో రోజుకు 30 వేల బెదిరింపులు వస్తున్నాయి. వ్యక్తిగత వివరాలుతెరిచిన పుస్తకంలా ఉండడం వల్ల ఏ విధమైన అనర్థాలు ఎదురవుతాయోనని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 
గోపాల్ సాథె,
హఫింగ్‌టన్ పోస్టు టెక్నికల్ ఎడిటర్ 

English Title
'Police realm' based on 'Aadhar'
Related News