‘కేంద్రాన్ని ఏపీ నిలదీస్తుంటే మీరేం చేస్తున్నారు’

Updated By ManamTue, 02/13/2018 - 15:14
 Ponguleti Sudhakar Reddy

Ponguleti Sudhakar Reddy Fires on TRS Government and CM KCRహైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీస్తుంటే.. తెలంగాణ మాత్రం ఎందుకు నిలదీయట్లేదని, ఎందుకు మౌనంగా ఉంటున్నారని సీఎం కేసీఆర్‌ను.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ఇప్పటికైనా విభజన చట్టంలోని హామీలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

కేంద్రంపై ఒత్తిడికి సీఎం అఖిలపక్షాన్ని కేంద్రవద్దకు తీసుకెళ్ళాలని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన తరువాత కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో కేసీఆర్ సర్కార్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? పోలవరం తో భద్రాచలం టెంపుల్ మునిగినా బీజేపీకి పట్టదా? పోలవరం డిజైన్ మార్పు గురించి రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపరు? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడికి స్టేట్ బీజేపీ నేతలు ముందుకువస్తారా? రారా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, రాష్ట్ర బీజేపీ నేతల మౌనం .. లోపాయకారి ఒప్పందానికి సంకేతమా? అని పొంగులేటి సూటి ప్రశ్న సంధించారు.

English Title
Ponguleti Sudhakar Reddy Fires on TRS Government and CM KCR
Related News