'మోస్ట్ డిజైరబుల్ వుమెన్‌'గా డీజే బ్యూటీ

Updated By ManamWed, 03/14/2018 - 14:44
Pooja Hegde

Pooja2017 సంవత్సరానికి గానూ 'మోస్ట్ డిజైరబుల్ వుమెన్‌'గా మొదటి స్థానాన్ని సంపాదించింది డీజే బ్యూటీ పూజా హెగ్డే. హైదరాబాద్‌లోని ఓ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో పూజా మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది 'డీజే' చిత్రంలో నటించిన పూజా హెగ్డే.. ఈ సంవత్సరం మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. దీంతో మోస్ట్ డిజైరబుల్ వుమెన్‌గా నిలిచింది.

ఇక పూజా తరువాత కాజల్, రకుల్ ప్రీత్, సింధు, ఆదా శర్మ వరుస స్థానాలు దక్కించుకున్నారు. కాగా.. తమన్నా, సిమ్రాన్ చౌదరి, స్రిస్టి వ్యకరనమ్, అనుష్క, మిధాలి తరువాత ఐదు స్థానాలను దక్కించుకున్నారు.  ఇదిలా ఉంటే గతేడాది మొదటి స్థానంలో ఉన్న కాజల్ ఈ సంవత్సరం రెండో స్థానానికి పడిపోగా.. అనుష్క మాత్రం రెండో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి వెళ్లిపోయింది.

Heroines


 

English Title
Pooja Hegde ranked first place in Most Desirable women-2017
Related News