నెగెటివ్‌తో పాజిటివ్

Updated By ManamTue, 09/18/2018 - 01:10
calorie food

నెగెటివ్ కాలొరీ ఫుడ్స్ అనేవి నిజంగా ఉంటాయా? అంటే లేదని చెప్పక తప్పదు..కాకపోతే సులువుగా జీర్ణం కాని ఆహార పదార్థాలను నెగెటివ్ కాలొరీ ఫుడ్స్ అంటారు. సరిగ్గా చెప్పాలంటే ఇవి తినడం వల్ల లభించే కాలొరీల కంటే జీర్ణమయ్యేందుకు ఎక్కువ కాలొరీలు అవసరమవుతాయి.. ఫైబర్ పుష్కలంగా లభించే పదార్థాలు ఈ కోవలోకి వస్తాయి.  యాపిల్స్, క్యారెట్స్, కీరా, లెట్యూస్ వంటివన్నీ ఈ కెటగెరీకి చెందినవే.  అందుకే ఇవి తిన్నప్పుడు జీర్ణక్రియ మందగించి, ఆకలి త్వరగా వేయకుండా చేస్తుంది.

image


వీటిలో ప్రథమ స్థానంలో నిలిచింది సెలరీ అంటే ఉల్లి కాడలు, రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిచే ఉల్లి కాడలను సూప్‌లు, సలాడ్లతో పాటు కూరలు, పచ్చళ్లలో విస్తృతంగా ఉపయోగిస్తారు. రక రకాల బెర్రీలు, టొమాటోలు, పుచ్చకాయ, బ్రాకోలి, పుట్టగొడుగులు వంటివి విస్తృతంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్‌లో ఉండేలా చూసుకుంటే బరువు పెరుగుతారన్న భయం అవసరం లేకపోగా, మీ షుగర్‌ను అదుపులో ఉంచుతుంది.

శారీరక అందానికి, మానసిక ప్రశాంతతకు ప్రత్యక్షంగా సహకరించే నెగెటివ్ కాలొరీ ఫుడ్ చక్కగా తోడ్పడుతుంది. ఫిట్‌గా, చురుగ్గా ఉండాలంటే ఇలాంటి ఆహారాన్ని బొజ్జనిండా హ్యాపీగా లాగించండి.  హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏదో ఎక్సర్‌సైజులు చేసేయడమే అనుకునేవారు తమ అభిప్రాయాలను మార్చుకుని ఈటింగ్ స్టైల్‌పై సరైన ఫోకస్ పెట్టాలి. ప్రొటీన్ సమకూర్చే ఇలాంటి ఆహారాన్ని మీ రొటీన్‌గా మార్చుకుంటే ఏజింగ్ వంటి 
సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 

సెలబ్స్ ఫస్ట్ లవ్ ఇదే
ఫిట్‌నెస్ ఫ్రీక్‌లైన సెలబ్రిటీలంతా తమ ఫస్ట్ లవ్‌గా ఈ నెగెటివ్ కాలొరీ ఫుడ్‌ను పేర్కొంటారు. తాజాగా ఈ జాబితాలో చేరిన యామీ గౌతమ్ తన కొత్త లుక్ కోసం నెగటివ్ కాలొరీ ఫుడ్‌తో ప్రేమలో పడ్డట్టు ఇన్‌స్టాగ్రాంలో తరచూ పోస్ట్ చేస్తున్నారు.  ఇలాంటి సహజమైన ఆహారాన్ని తీసుకోవడంతో చర్మం నిగారింపు రెట్టింపు అవుతూనే ఫ్రెష్‌గా ఫీల్ అయ్యేందుకు అవసరమైన ఎనర్జీ వస్తుంది. 

English Title
Positive with Negative
Related News