నార్కో నిర్ణయంపై తీర్పు వాయిదా

Updated By ManamThu, 09/06/2018 - 22:50
high court
  • అయేషామీరా హత్య కేసులో హైకోర్టు 

andhra courtహైదరాబాద్: బీ ఫార్మసీ విద్యార్థి అయేషా మీరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నార్కో పరీక్షలు నిర్వహించాలన్న కేసులో తమ నిర్ణయాన్ని తర్వాత ప్రకటిస్తామని హైకోర్టు తెలిపింది. నార్కో అనాలసిస్ పరీక్షలకు విజయవాడలోని కోర్టు అనుమతి ఇవ్వలేదు. దాంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కింది కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో ఇరు పక్షాల వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెల్లడిస్తామని న్యాయమూర్తి బాలయోగి వెల్లడించారు. విజయవాడ సమీపంలోని ఓ హాస్టల్‌లో అయేషా మీరా 2007లో హత్యకు గురయ్యింది. అప్పుడు ఆమెతోపాటు గదిలో ఉన్న ఇద్దరు యువతులు, హాస్టల్ వార్డెన్ పద్మ, వార్డెన్ భర్త వెంకట శివరామకృష్ణ, ఆయేషా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న.. అబ్బూరి గణేష్, కోనేరు సతీష్‌బాబు, చింతల పవన్ కుమార్‌కు నార్కో పరీక్షలకు 2008లో విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసుతో సత్యంబాబుకు సంబంధం లేదని హైకోర్టు తీర్పు చెప్పడంతో తిరిగి దాఖలైన వ్యాజ్యాల నేపథ్యంలో మళ్లీ సిట్ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. దాంతో పైవారికి నార్కో పరీక్షలు నిర్వహించేందుకు కింది కోర్టు నిరాకరించింది. నార్కో పరీక్షలు నిర్వహించాలని ఆయేషా తల్లిదండ్రులు, సిట్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పు వాయిదా పడింది. 

English Title
Postponed the verdict on Narco's decision
Related News