కొంపముంచే కోళ్ల మాంసం

Updated By ManamMon, 04/02/2018 - 03:03
chicken
  • యాంటిబయోటిక్స్ దుర్వినియోగం

  • కోళ్ల పరిశ్రమ భూముల్లో బాక్టీరియా అవశేషాలు: సీఎస్‌ఈ వెల్లడి 

imageయాంటిబయోటిక్స్‌ను కోళ్ల పరిశ్రమ దుర్వినియోగం చేస్తోందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) ఆరోపించింది. కోళ్ల పరిశ్రమ నుంచి అందే చికెన్, గుడ్డు తదితర ఆహారపదార్థాల కారణంగా యాంటిబయోటిక్స్ నిరోధక సంక్షోభం పెరుగుతోదని సీఎస్‌ఈ ఆం దోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 27న జాతీయ ఆంగ్ల దినపత్రికల్లో వచ్చిన వ్యాపార ప్రకటనను ప్రస్తావిస్తూ, అఖిలభారత పౌల్ట్రీ అభివృద్ధి, సేవల ప్రైవేట్ లిమిటెడ్ ఈ అంశంలో పూర్తిగా తప్పుదారి పట్టిస్తోందని సీఎస్‌ఈ విమర్శించింది. కోళ్ల ఫారాల నుంచి లభించే ఆహార పదార్థాలపై 2014లో సీఎస్‌ఈ అధ్యయునానికి జవాబుగా ఈ ప్రకటన ఉందని, ఆ అధ్యయన నివేదికను సంపూర్తిగా పక్కదారి పట్టించేలా ఈ ప్రకటన ఉందని సీఎస్‌ఈ విరుచుకుపడింది. పౌల్ట్రీ ఉత్పత్తి చేసే ఆహారపదార్థాల్లో యాంటిబయోటిక్స్ దుర్వినియోగం ఏమీలేదని వాణిజ్యప్రకటనలో చెప్పడాన్ని సీఎస్‌ఈ తిరస్కరించింది. ‘ఇది పచ్చి అబద్ధం. కోళ్ల పరిశ్రమలో యాంటిబయోటిక్స్ దుర్వినియోగం లేదనడం అవాస్తం. కోళ్ల పరిశ్రమలో ప్రాణరక్షణకు (ఛిౌజూజీట్టజీ ౌ్ట జ్చ్ట్ట్ఛ) సంబంధించిన మందులను కూడా విచ్చలవిడిగా వాడుతున్నారన్నది వాస్తవం. యాంటిబయోటిక్స్ దుర్వినియోగాన్ని తగ్గించే నిజాయితీ చర్యలు కోళ్ల పరిశ్రమకు లేదని, ఈ వాణిజ్యప్రకటన కేవలం కంటితుడుపు చర్యే’నని సీఎస్‌ఈ డిప్యూటీ డైరెక్టర్ చంద్రభూషణ్ వ్యాఖ్యానించారు.

వాస్తవం చెప్పుకోవాలంటే తమ 2017 తాజా అధ్యయునాన్ని కోళ్ల పరిశ్రమ విస్మరించిందని ఆయన విమర్శించారు. కోళ్ల ఎదుగుదల, జబ్బుల బారిన పడకుండా ఎక్కువ మోతాదులో యాంటిబయోటక్స్‌ను వాడడం సర్వసాధారణమైంది. కోళ్లఫారాల వల్ల ఫారాల భూమే కాకుండా వ్యవసాయ భూమి కూడా నిస్సారమవుతోందని సీఎస్‌ఈ పేర్కొన్నది. ఈ యాంటిబయోటిక్స్ నిరోధకాలు కోళ్ల నుంచి వ్యవసాయ భూములు, ఆ తరువాత నీళ్లలోకి చేరుకుంటున్నాయని, ఇదంతా గొలుసు వ్యవస్థలా తయాైరెందని సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ అమిత్ ఖురానా పేర్కొన్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌ల్లోని కోళ్ల ఫారాల నుంచి 47 ప్రాంతాల్లో భూమి నమూనాలను సేకరించారు. ఈ నమూనాల నుంచి 217 రకాల సాధారణ మూడు బాక్టీరియా అవశేషాలు కనుగొన్నారు. వీటిని ఈ.కోలి, కే.న్యుమోనియా, ఎస్.లెంతుస్‌గా గుర్తించారు. ఈ మూడు బాక్టీరియాల వల్ల డయోరియా, మూత్ర సం బంధ వ్యాధులు, న్యుమోనియా, రక్తప్రసరణలో ఇబ్బందులు తదితర వ్యాధులకు కారణమవుతాయని సీఎస్‌ఈ అభిప్రాయుపడుతోంది. 
  శీలోజు యాదగిరి

English Title
Poultry meat
Related News