ప్రభాస్ లవ్‌స్టోరీలో అనుష్క..?

Prabhas, Anushka

టాలీవుడ్ హిట్ పెయిర్ లిస్ట్‌లో ప్రభాస్, అనుష్క ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ అన్నీ చిత్రాలు విజయం సాధించగా.. త్వరలో ఈ ఇద్దరు మరో మూవీలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

వివరాల్లోకి వెళ్తే ఓ వైపు సుజిత్ దర్శకత్వంలో సాహోలో నటిస్తున్న ప్రభాస్.. మరోవైపు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఎయిల్‌టెల్ భామ శాషా ఛెత్రీ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అనుష్క కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రనుష్క(ప్రభాస్, అనుష్క) అభిమానులకు శుభవార్తే.

సంబంధిత వార్తలు