పట్టణ సంస్కరణలకు పెద్దపీట

Updated By ManamTue, 03/13/2018 - 01:03
image

భూమికి టైటిల్ పెట్టడమనేది పట్టణ ప్రాంతా లలో మరో ఆందోళనకర అంశం. 2001లో మెకిన్సే అధ్యయన నివేదిక ప్రకారం, దేశంలో ఒక అంచనా ప్రకారం 90 శాతానికి పైగా భూములకు సరైన పట్టాలు లేవు. భూమి యాజమాన్య హక్కులు ఎవరికి చెందుతాయో తెలియదు. సరైన పట్టాలు లేకపోవడం వల్ల జీడీపీలో 1.3 శాతం మేరకు నష్టం వాటిల్లుతోంది.

imageకేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మునిసిపల్ సంస్కరణల కోసం ఓ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. అటల్ పునరు జ్జీవన, పట్టణ పునర్నిర్మాణ కార్యక్రమం (అమృత్) కింద 2015-17 సంవత్సరాలలో 500 నగరాలలో కొన్ని మౌలిక సంస్కరణలను చేపట్టడం జరిగింది. ఉదాహరణకు 14 రాష్ట్రాలలోని 104 నగరాలలో 90 శాతానికి పైగా యూజర్ చార్జీలను వసూలు చేశాయి. 21 రాష్ట్రాలు మునిసిపల్ కేడర్‌లను ఏర్పాటు చేశాయి.  256 నగరాలు ఆన్‌లైన్ పౌర సేవలను అందజే యడం ప్రారంభించాయి. 21రాష్ట్రాలు రాష్ట్ర ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేశాయి. 363 నగరాలు క్రెడిట్ రేటింగ్‌ను పూర్తి చేశాయి. ఇక తదుపరి స్థాయికి వెళ్లాల్సిన సమ యం ఆసన్నమైంది. తదుపరి స్థాయి సంస్కరణలు మూడు అంచెలుగా కొనసాగుతాయి :

మొదటి అంచె : 
దీని ప్రధానోద్దేశం, ప్రస్తుతం అమలులో ఉన్న కీలక ఆర్థిక, సేవా వితరణ సంస్కర ణలను వేగవంతం చేయడం. మొత్తం మూడు రకాల సంస్కరణలున్నాయి. 1) ఓ పురపాలక సంఘం పనితీరు గ్రాంటు కోరిన సంవత్సరానికి రెండేళ్ల ముందు నుంచి నగరం ఆడిట్ చేసిన అకౌంట్లను ఓ ఏడాదికి సమర్పించాల్సి ఉంటుంది. ఆడిట్ అకౌం టులో చూపించిన మాదిరిగానే నగరం తన సొంత రెవెన్యూలలో పెరుగుదలను చూపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తమ సొంత రెవెన్యూ వ్యయాల నుంచి పట్టణ స్థానిక సంస్థలు 70 శాతానికి పైగా ఆదా యాన్ని చూపించాల్సి ఉంటుంది. నీటి సరఫరా, ఆదాయేతర నీటి వినియోగం తగ్గింపు, వ్యర్థాల శుద్ధి ప్రక్రియ వంటి వాటికి సంబంధించి నగరాలు అంచనాలు తయారు చేసి, వాటిని ముద్రించాల్సి ఉంటుంది. వీటిని ప్రతి ఏటా ముద్రించాల్సి ఉంటుంది. ఈ షరతులను గనుక నెరవేరిస్తే నగరాలకు పద్నాలుగవ ఆర్థిక సంఘం నుంచి పనితీరు గ్రాంట్ (5 ఏళ్లకు రూ. 18,000 కోట్లు) మంజూరవుతుంది. 

రెండవ అంచె: 
ఇందులో ఐదు పరివర్తన సంస్క రణలుంటాయి. 1) విలువను రాబట్టుకోగల ఆర్థిక విధానాన్ని రూపొందించి అమలు చేయడం 2) ప్రతి పట్టణ స్థానిక సంస్థా క్రెడిట్ రేటింగ్, ప్రతి నగరమూ పెట్టుబడి పెట్టగల స్తోమతను నిర్ధారించుకుని మునిసిపల్  బాండ్లను జారీ చేయడం 3)మునిసిపల్ కేడర్‌లను నియమించి వారిని వృత్తిపరంగా నిష్ణా తుల్ని చేయడం, వృత్తి నైపుణ్యం గల ఉద్యోగాలలో అటువంటి వారిని నియమించడం 4) ట్రస్ట్ అండ్ వెరిఫై మోడల్‌ను అమలు చేయడం 5) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయంతో భూమి పట్టాల చట్టాన్ని తయారు చేసి అమలు చేయడం. 
   గతంలో మునిసిపల్ అనుమతులు జారీ చేసే విధానాన్నే ఇప్పుడు వెరిఫై అండ్ ట్రస్ట్ విధానంగా మార్చారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడంలో నగరాలు మొదటగా అనుమతులు మం జూరు చేసి ఆ తర్వాత పరిశీలించి నిర్ధారించు కుంటా యి. ఈ పద్ధతినే ఇప్పుడు వెరిఫై అండ్ ట్రస్ట్ విధాన మంటున్నారు. తనిఖీల వల్ల బాగా ఆలస్యాలు జరగ డంతో పాటు, ఖర్చులు పెరగడం, అద్దెలు అడగడా నికి అవకాశాలు పెరగడం జరుగుతోంది. అయితే ఈ వెరిఫై అండ్ ట్రస్ట్ విధానంలో మొదటే అనుమతి మంజూరు చేసి ఆ తర్వాత నిర్ధారించుకుంటాయి. పౌరులు సాధారణంగా సరైన సమాచారమే ఇస్తారని, అందువల్ల వారి మీద నమ్మకం ఉంచి అనుమతులు మంజూరు చేయాలన్నదే ఇందులోని ఉద్దేశం. దరఖా స్తులను అవసర పత్రాలతో ఆన్‌లైన్‌లోనే సమర్పి స్తారు. వాటిని ఆన్‌లైన్‌లోనే పరిశీలిస్తారు. అవి పూర్తి గా ఉంటే, వాటికి అనుమతి మంజూరు చేస్తారు. 
భూమికి టైటిల్ పెట్టడమనేది పట్టణ ప్రాంతా లలో మరో ఆందోళనకర అంశం. 2001లో మెకిన్సే అధ్యయన నివేదిక ప్రకారం, దేశంలో ఒక అంచనా ప్రకారం 90 శాతానికి పైగా భూములకు సరైన పట్టాలు లేవు. భూమి యాజమాన్య హక్కులు ఎవరికి చెందుతాయో తెలియదు. సరైన పట్టాలు లేకపోవడం వల్ల జీడీపీలో 1.3 శాతం మేరకు నష్టం వాటిల్లు తోంది. భారతదేశంలో భూమి యాజమాన్య  హక్కు లు పట్టాల ద్వారా నిర్ధారణ అవుతుంటాయి. ప్రస్తుత యజమానికి ఫలానా భూమి రావడానికి గతంలో ఎంత యజమానుల నుంచి చేతులు మారాయన్నది రకరకాల అధికార పత్రాల ద్వారా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఇందులో కొందరు వారసత్వం ద్వారా ఈ భూమికి యజమాని అయి ఉంటారు. కొందరు బదిలీ ద్వారా యజమాని అయి ఉంటారు. మరికొందరు తమ యాజమాన్యాన్ని ఇతరత్రా నిరూపించుకుని యజమాని అయి ఉంటారు. అందువల్ల, ఈ రకరకాల యజమానుల వివరాలను తీసి పక్కన పెట్టకుండా, అందరి హక్కులను పరిగణ నలోకి తీసుకోవడానికి వీలుగా ఓ సమగ్ర చట్టాన్ని రూపొందించాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్ర పౌరులకు యాజమాన్య హక్కులు కల్పించ డానికి, వారికి ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి రాజస్థాన్ ప్రభుత్వం పట్టణ భూముల (పట్టాల ధ్రువీకరణ) బిల్లు (2016)ను ప్రవేశపెట్టింది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇటువంటి బిల్లును ప్రవేశపెట్టడానికి ఇది స్ఫూర్తిదాయకమైంది. కొత్త పట్టణ సంస్కరణలకు కూడా ఇదే బీజం వేసింది. 
ఇక రాష్ట్రాలు, నగరాలు బ్లాక్‌చైన్ వంటి లీప్‌ఫ్రాగ్  టెక్నాలజీని వినియోగంలోకి తీసుకు రావడానికి ప్రోత్సహించడం జరిగింది. బ్లాక్‌చైన్ అంటే వివిధ లావాదేవీలకు (ఇక్కడ స్థిరాస్తులకు) డిజిటల్ లెడ్జర్‌ను రూపొందించడం. దీని వల్ల డిజిటల్ పరంగా సమా చారాన్ని పంపిణీ చేయడానికి ఆస్కారం కలుగు తుంది. అంటే పట్టాలకు, యాజమాన్య హక్కులకు, ఇతర లావాదేవీలకు సంబంధించిందన్న మాట. డేటాబేస్‌ను ఏ ఒక్క ప్రదేశంలోనో నిక్షిప్తం చేయ కుండా వివిధ శాఖలన్నిటిలో ఈ సమాచారం నిక్షిప్తం అయ్యేటట్టు, దీనికి ఓ కేంద్ర బిందువు ఉండేటట్టు ఇందులో ఏర్పాటు చేస్తారు. ఆస్తికి సంబంధించి జరిగిన ప్రతి లావాదేవీనీ, ఆస్తికి సంబంధించిన ప్రతి కార్యకలాపాన్నీ ప్రతి శాఖ లెడ్జెర్‌లోనూ భద్ర పరుస్తారు. దీన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ కూడా చేస్తుంటారు. ఆ విధంగా సమాచార పంపకం జరుగు తుంది. ఈ ఆస్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ చూడడానికి వీలవుతుంది. అయితే, వీటిని తారుమారు చేయడానికి ఎవరికీ అవకాశం ఉండదు. పైగా ప్రతి లావాదేవీకి సంబంధించిన సమయాన్నీ ఇందులో పొందుపరుస్తారు. అందువల్ల మోసం చేయడానికి అవకాశం ఉండదు. వీటికి నోటరీ వంటి సేవలను కూడా కలుపుతారు. నిజానికి ఇది కూడా ఒక విధంగా ఎంకబ్రెన్స్ సర్టిఫికేట్ లాంటిదే. ఈ సర్టిఫికేట్‌ను రాష్ట్ర ప్రభుత్వాల రిజిస్ట్రేషన్ విభాగాలు జారీ చేస్తుంటాయన్న విషయం తెలిసిందే. 

మూడవ అంచె : 
మూడు స్తంభాల మీద అతి వేగంగా ఈ పరివ ర్తన సంస్కరణలను నిలబెట్టడం మీద దృష్టిని కేంద్రీ కరిస్తున్నారు. అవి : పరిపాలన, ప్రణాళిక, ఆర్థికం. 1) వికేంద్రీకరణను మరింత విస్తృతం చేసి, పట్టణ స్థానిక సంస్థలను నిధుల మంజూరులోనూ, పనితీరులోనూ, విధి నిర్వహణలోనూ మరింత పటిష్ఠం చేయడమే వీటన్నిటి ప్రధానోద్దేశం. 2) స్వయం సమృద్ధికి, తన కాళ్ల మీద తాను నిలబడడానికి వీలుగా సొంత వనరులను సృష్టించడం, 3) పట్టణ ప్రణాళికలో మార్పులకు వెసులుబాటు కల్పించడం ముఖ్యంగా నగరాల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, సామాజిక ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా ప్రధాన ప్రణాళికలను సమన్వయ పరచడం జరుగుతోంది. 
అంతేకాదు, కింది స్థాయి వరకు జవాబుదారీని పెంచడం కూడా దీని ముఖ్యోద్దేశం. అంటే పథకాల అమలులో, నిర్వహణలో స్థానిక వార్డు కమిటీలు జవాబుదారీతనంతో వ్యవహరించేటట్టు చేయడానికి యంత్రాంగం రూపొందుతుందన్న మాట. ఇక ఈ విషయంలో రాష్ట్రాలు, నగరాలు పోటీ పడుతుం టా యి. వాటి పురోగతిని బట్టి ప్రోత్సాహకాలు ఇవ్వ డం జరుగుతుంటుంది. ఏ నగరానికి ఆ నగరం, ఏ రాష్ట్రా నికి ఆ రాష్ట్రం సంస్కరణలు చేపట్టడానికి వెసులు బాటు కల్పించారు. అవి తమకు వీలైన విధంగా సంస్కరణలను రూపొందించుకోవచ్చు. ఎటువంటి సంస్కరణలు చేపట్టాలన్నది రాష్ట్రాలకే వదిలేయడం జరిగింది. 
మొత్తం మీద, పట్టణ సంస్కరణలను ఏ విధంగా రూపొందించారంటే మొదటి అంచెలో పరిశీ లనకు, నిర్ధారణకు అవకాశం కల్పించారు. మూడవ అంచెలో రాష్ట్రాలు, నగరాలు తమకు కావాల్సిన సంస్కరణలు తాము చేపట్టడానికి అవకాశం కల్పించారు. రెండవ అంచెలో రాష్ట్రాలు, నగరాలు తమ ప్రాధాన్యాలను, ప్రాధమ్యాలను పరివర్తనీయ సంస్కరణల వైపు మళ్లించడానికి అవకాశమిచ్చారు. 

సమీర్ శర్మ, ఐ.ఎ.ఎస్

(రచయిత కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖలో అదనపు కార్యదర్శి)

English Title
Preferred to urban reforms
Related News