సన్నీ లియోన్‌ని దాటేసిన వారియర్

Updated By ManamTue, 02/13/2018 - 18:09
Priya warrior
priya warrior

ఇంటర్నెట్ లేటెస్ట్ సంచలనం ప్రియా వారియర్‌కు దేశ వ్యాప్తంగా రెండ్రోజుల్లోనే లక్షలాది మంది అభిమానులైపోయారు. ప్రియా వారియర్ కన్ను గీటుతున్న  వైరల్ వీడియో క్లిప్ ఎందరో కుర్రకారుల హృదయాన్ని కొల్లగొట్టేసింది. వాలెంటైన్స్ డే సమీపిస్తున్న తరుణంలో వారియర్ కంటి భాష ప్రేమ హృదయాలను హత్తుకుంటోంది. గత రెండ్రోజులుగా గూగిల్‌లో అత్యధికులు సెర్చ్ చేస్తున్న సెలబ్రిటీల్లో ఒకరుగా ప్రియా వారియర్ నిలిచిపోయారు. ఈ విషయంలో బాలీవుడ్ బ్యూటీలు దీపిక పదుకొనె, సన్నీ లియోన్, కత్రినా కైఫ్‌, అనుష్క, శర్మ, అలియా భట్‌లను కూడా వారియర్ వెనక్కి నెట్టేసింది. 

google trends

గూగిల్‌లో అత్యధిక నెటిజన్లు ఈ మలయాళ నటి కోసమే సెర్చ్ చేస్తున్నట్లు గూగిల్ ట్రెండ్స్ తేటతెల్లం చేస్తున్నాయి. ఫిబ్రవరి 11 ముందు వరకు ప్రతి రోజూ గూగిల్‌లో అత్యధికులు సెర్చ్ చేసే సెలబ్రిటీల జాబితాలో సన్నీ లియోన్ అగ్రస్థానంలో ఉండేది. అయితే ఫిబ్రవరి 11 రాత్రి నుంచి వారియర్ సన్నీ లియోన్‌ను వెనక్కి నెట్టేసింది. 

English Title
Priya Prakash Beats Sunny Leone, Deepika Padukone to Become Most Searched Celebrity On Google
Related News