ఆ పార్టీల వల్లే హాలీవుడ్ ఛాన్స్ వచ్చింది

Updated By ManamFri, 08/10/2018 - 11:57
Priyanka Chopra

Priyanka Chopra‘క్వాంటికో’ అనే టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, ఆ తరువాత బేవాచ్ సినిమాలో నటించింది. ఇప్పుడు మరికొన్ని హాలీవుడ్ ప్రాజెక్ట్‌లు ఆమె చేతిలో ఉన్నాయి. ఈ సందర్భంగా తన హాలీవుడ్ ప్రయాణం ఎలా మొదలైందన్న విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

‘‘హాలీవుడ్ ప్రయాణం చాలా భయంకరమైంది. కానీ మంచి అనుభవం. హాలీవుడ్‌ రికార్డు ప్రొడ్యూసర్ జిమ్మీ లొవైన్‌తో కలిసి ఆల్బమ్ చేయాలని నా మేనేజర్ సలహా ఇచ్చాడు. అలా అమెరికాకు వెళ్లాను. అక్కడ కొంతమంది స్నేహితులయ్యారు. ఆ తరువాత అక్కడి ఈవెంట్లు, పార్టీలకు హాజరయ్యేదాన్ని. ఆ పార్టీలకు వచ్చిన వారిలో గ్రామీ అవార్డులు తీసుకున్న వారు కూడా ఉన్నారు. వారు నన్ను అమెరికాలో నువ్వు ఎందుకు పనిచేయకూడదని అడిగారు. అప్పుడే హాలీవు్ గురించి ఆలోచించా.

ఆ తరువాత అమెరికాకు చెందిన కమర్షియల్ బ్రాడ్‌కాస్ట్ టెలివిజన్ నెట్‌వర్క్ వైస్ ప్రెసిడెంట్ నన్ను టీవీ షోలలో నటించమని అడిగారు. అయితే టీవీలో నటించాలంటే కనీసం ఆరేళ్లు పడుతుందని ఆలోచించి వద్దన్నాను. ఆ తరువాత వారు భారత్ వచ్చి, నాకు 26రకాల స్ర్కిప్ట్‌లను వినిపించారు. వాటిలో క్వాంటికోలోని అలెక్స్ పాత్ర ఒకటి. ఆ పాత్ర ఇండో- అమెరికన్ అందుకే అందులో నటించేందుకు ఒప్పుకున్నా. మా నాన్న నా కోసం హాలీవుడ్‌లో ఆఫర్లు ఉంచి వెళ్లలేదు. ఏం చేసినా నా అంతట నేనే చేయాలి. అలా ప్రయత్నిస్తుండగా బేవాచ్‌లో నటించే అవకాశం వచ్చింది’’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక.

English Title
Priyanka Chopra about her Hollywood journey
Related News