టాటా పవర్‌కు లాభాల ప్రవాహం

Updated By ManamFri, 07/27/2018 - 22:33
tata

tataన్యూఢిల్లీ: టాటా పవర్ 2018 జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి రూ. 1735 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం అదే త్రైమాసికంలో అది చూపిన రూ. 405.8 కోట్ల లాభం కన్నా ఇది నాలుగు రెట్లకన్నా ఎక్కువ. అసోసియేట్ కంపెనీలైన టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పానటోన్ ఫిన్వెస్ట్ లిమిటెడ్‌లో ఉన్న వాటాలను టాటా పవర్ విక్రయించడంతో దానికి అసాధారణమైన స్థాయిలో నిధులు వచ్చి పడ్డాయి. అలా లభించిన రూ. 1897 కోట్లను అది అసాధారణ ఆదాయంగా చూపింది. క్రిందటేడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ. 6,559.4 కోట్లుగా ఉన్న కంపెనీ ఏకీకృత ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో రూ. 7,403.18 కోట్లకు పెరిగింది. అయితే, కంపెనీ మొత్తం వ్యయాలు కూడా ఏడాది క్రితం అదే కాలంలో ఉన్న రూ. 6,066.8 కోట్ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం క్యూ 1లో రూ. 7,156.19 కోట్లకు పెరిగాయని కంపెనీ సి.ఇ.ఓ, వేునేజింగ్ డైరెక్టర్ ప్రవీర్ సిన్హా చెప్పారు. థర్మల్, జల విద్యుచ్ఛక్తి విభాగాలు చక్కని పనితీరు కనబరచడం కొనసాగుతోందని ఆయన తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరులపై కూడా దృష్టి కేంద్రీకరించినట్లు ఆయన చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు మహారాష్ట్ర ఈవీని సిద్ధం చేయడానికి టాటా మోటార్స్‌తో టాటా పవర్ పొత్తు పెట్టుకుంది.

English Title
Profit flow to Tata Power
Related News