అలరించిన ‘ప్రగతి నివేదన’

Updated By ManamTue, 09/04/2018 - 02:14
kcr

అనుకున్నట్టుగానే కొంగరకలాన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రగతి నివేదన సభ విజయవంతమైంది. ఈ నాలుగేళ్ల కాలంలో తన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను సంపూర్ణంగా వివరించారు. ఓటు అడిగే హక్కు మరొకరికిగానీ, మరో పార్టీకిగానీ లేదని, ఆ హక్కు తనకొక్కరికే ఉందని ఆయన అన్నారు. అరవై ఏళ్లలో జరగని అభివృద్ధిని తాము జరిపి చూపించామని ఆయన ఉద్ఘాటించారు. ఏదేమైనా ఈ సభ ద్వారా టీఆర్‌ఎస్ క్యాడర్‌కు నూతన ఉత్సాహాన్ని కలిగించారు. 

kcrఊహించినట్లుగానే కొంగరకలాన్‌లో ముఖ్యమంత్రి కేసీ ఆర్ నిర్వహించిన ప్రగతినివేదన సభ విజయవంతమైంది. వేలాది వాహనాల్లో లక్షలాదిగా ప్రజలు తరలిరావడంతో గులాబీ శ్రేణులు ఆనంద తరంగాల్లో తేలియాడారు. స్వయంగా కేసీఆర్ కూడా సభ విజయవంతం పట్ల సంతృప్తిని, ఆనందాన్ని వ్యక్తంచేశారు. దేశచరిత్రలో ఇలాం టి సభ ఎన్నడూ జరగలేదని హర్షం వెలిబుచ్చారు. నాలు గున్నర సంవత్సరాల తమ పాలనా కాలంలో ప్రజలకు ఏమేమి చేశారో, ఏమి చెయ్యలేదో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకరువు పెట్టారు. దేశచరిత్రలో ఏ పార్టీ చెయ్యనన్ని పనులు, చేపట్టని సంక్షేమ కార్యక్రమాలు టీఆర్‌ఎస్ చేసి చూపించిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. మిషన్ భగీ రథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఆసరా పెన్షన్లు తదితర అనేక సంక్షే మ పథకాలను ముఖ్యమంత్రి వల్లెవేశారు. ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీలకు గురుకులాలు, గొర్రెలు, బర్రెలు, కోళ్ళు కుందేళ్ళు వంటి తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ముఖ్య మంత్రి వివరించారు. కృష్ణా, గోదావరి జలాలను ఇంటిం టికీ అందించే పనులు శరవేగంతో జరుగుతున్నాయని, ముందే చెప్పినట్లు ప్రతి ఇంటికీ నల్లానీళ్ళు ఇవ్వలేకపోతే ఓట్లు అడిగే ప్రసక్తే లేదని ప్రగతి నివేదన సభ సాక్షిగా మరోసారి ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగా ఉండ బట్టే ఉద్యోగ అవకాశాల్లో 95% సాధించగలిగానని, ఈ పని మరొకరి వల్ల కాగలదా.. అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ పాలకులకు గులాములుగా ఉందామా.. ఆత్మగౌరవం తో బతుకుదామా.? అంటూ తనదైన శైలిలో ప్రజల భావోద్రేకాలను తట్టిలేపారు. అరవై ఏళ్ళలో జరగని అభి వృద్ధి నాలుగేళ్ళలో చేసి చూపించామని, ఓట్లడిగే హక్కు తమకూ, తమపార్టీ టీఆర్‌ఎస్‌కు తప్ప, మరొకరికి గాని, మరో పార్టీకి గాని లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రతిపనినీ విమర్శించడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షాల అభిప్రాయం ఎలాగున్నా కొంగరకలాన్ సభ ద్వారా కేసీఆర్, ప్రజలకు తన ప్రోగ్రెస్ వివరించే ప్రయత్నం బలంగా చేశారన్నది నిర్వివాదాంశమే. తనకు ఎందుకు ఓటు అడిగేహక్కున్నదో ఆయన విడమరిచి ప్రజలకు అర్ధమయ్యేరీతిలో వివరించారు.

అయితే చాలామంది ఊహించినట్లుగా ముందస్తు ఎన్నికలకు, అసెంబ్లీ రద్దుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి స్పష్టమైన ప్రకటనా చేయలేదు. కాకపోతే ముందస్తు ఉంటుందన్న విషయాన్ని నర్మగర్భంగా చెప్ప కనే చెబుతూ, తన సహజ స్వభావానికి భిన్నంగా ఆయన బాగా ఆలోచించి, ఆచితూచి మాట్లాడారు. ఉద్యమ నాయ కుడిగా ఉన్నా, రాజకీయనేతగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టడం ఆయన నైజం. కాని కొంగరకలాన్ ప్రగతి నివేదన సభలో ముంద స్తుకు సంబంధించి మాత్రమే కాదు, ఏ విషయంలోనూ ఆయన ఆ రేంజ్‌లో మాట్లాడలేదు. ఎంతగానో ఆచితూచి మాట్లాడారు. కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఏక గ్రీవంగా తనకు సర్వాధికారాలూ కట్టబెట్టిందని, కనుక రాజకీయ నిర్ణయాలు తరువాత మాట్లాడతానని ఆయన స్పష్టం చేశారు. చెప్పినా చెప్పకపోయినా ముఖ్యమంత్రికి ముందస్తు ఆలోచనే ఉందని రాజకీయ విశ్లేషకులు చాలా బలంగా అంచనా వేస్తున్నారు. క్యాబినెట్ సమావేశం ఏక గ్రీవంగా సర్వనిర్ణయాధికారాన్ని ముఖ్యమంత్రికి వది లేయ డం, ప్రగతి నివేదన సభ ముగియకమునుపే ప్రిన్స్‌పల్ సెక్రెటరీ నుంచి ఐదు, ఆరు తేదీల్లో ఏదో ఒకరోజు మరో క్యాబినెట్ భేటీకి రంగం సిద్ధం కావడం, తమతమ శాఖ లకు సంబంధించి పూర్తి సమాచార నివేదికలతో హాజరు కావాలని మంత్రులకు సమాచారం అందడం దీనికి బలం చేకూరుస్తోంది. మొత్తానికి ఈ నెల ఆరవ తేదీనే అసెంబ్లీ రద్దు కావచ్చని కొందరు మంత్రుల మాటల ద్వారా అర్ధమవుతోంది. కొత్త పథకాల విషయానికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తల్ని ప్రస్తావిస్తూ, పార్టీ ప్రధాన కార్యదర్శి కే.కేశవరావు అధ్యక్షతన రూపుదిద్దుకొనే మ్యాని ఫెస్టోలో ఆ విషయాలు పెడతామని ప్రస్తుతం కొత్త పథ కాల ఆలోచన సరికాదన్నారు. 
యండి.ఉస్మాన్ ఖాన్ 
సీనియర్ జర్నలిస్టు

Tags
English Title
'Progress Reference'
Related News