పంజాబ్ చిత్తుచిత్తు

Updated By ManamTue, 05/15/2018 - 00:52
kohli team
  • 10 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం

ఇండోర్ : ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్‌కు ఘోరపరాభవం ఎదురైంది. రాయల్స్ umeshచాలెంజర్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. ఈ విజయంతో రాయల్ చాలెంజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.1 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ స్వల్ప లక్ష్యాన్ని రాయల్ చాలెంజర్స్ జట్టు 8.1 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (48: 28 బంతుల్లో ఆరు ఫోర్లు, 2 సిక్స్‌లు) పార్థివ్ పటేల్ (40:22 బంతుల్లో 7 ఫోర్లు) వికెట్ నష్టపోకుండా ఆడి జట్టుకు ఘన విజయం అందించారు.

88కే ఆలౌట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ పంజాబ్ ఆరంభంలో ఫర్వాలేదనిపించింది. రాహుల్ మూడు సిక్సర్లు, గేల్ నాలుగు ఫోర్లతో దూకుడుగా కనిపించారు. అయితే ఈ ఇద్దరినీ ఉమేశ్ యాదవ్ బోల్తా కొట్టించాడు. ఒకే ఓవర్‌లో రాహుల్ (21), క్రిస్ గేల్ (18)లు నిష్క్రమించడంతో ఇక కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్ పేకవేుడలా కూలిపోయింది. అయితే అరోన్ ఫించ్ (26) ఔటైన తర్వాత కింగ్స్ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది.ఆపై సిరాజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ (2) ఔట్ కాగా, అటు తర్వాత చాహల్ బౌలింగ్‌లో స్టోయినిస్ (2) నాల్గో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో కింగ్స్ 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే మరో 38 పరుగులు మాత్రమే చేసిన కింగ్స్ పంజాబ్ మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. 8 మంది ఆటగాళ్లు రెండకెల స్కోరు కూడా చేయలేకపోవడంతో 88 పరుగులకే పంజాబ్ ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్ ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టి పంజాబ్‌ను దెబ్బ తీశాడు. సిరాజ్, మొయిన్ అలి, చాహల్, గ్రాండ్‌హోమ్ తలో వికెట్ తీశారు.

సంక్షిప్త స్కోర్లు
కింగ్స్ లెవెన్ పంజాబ్ : 15.1 ఓవర్లలో 88 ఆలౌట్ (పింఛ్ 26, కె.ఎల్.రాహుల్ 21, ఉమేశ్ యాదవ్ 3/23).
రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు: 8.1 ఓవర్లలో 92/0 (కోహ్లీ 48 నాటౌట్, పార్థివ్ పటేల 40 నాటౌట్)

English Title
punjab team is defeat
Related News