పుతిన్ పునరాగమనం

Updated By ManamThu, 03/22/2018 - 01:54
PUTIN

PUTINరష్యా అధ్యక్షుడిగా వ్లాడిమర్ పుతిన్ నాలుగోసారి ఎన్నికయ్యారు. ఆయన మరో ఆరేళ్లపాటు పదవీ బాధ్యతలు స్వీకరించేలా రష్యా ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. జోసెఫ్ స్టాలిన్ తరువాత అత్యధిక కాలం రష్యాను ఏలబోతున్న నేతగా పుతిన్ చరిత్రను సృష్టించనున్నారు. ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆరోపణల మాట అలా వుంచితే ఎవరు పోటీచేసినా పుతిన్ విజయం మాత్రం ఖాయమని అనుకోవడంలో సందేహపడనక్కరలేదు. అధికారం కోసం జీవితాంతం వరకు కుర్చీకి అంటుకుని కూర్చోవాలన్న కోరిక తనకేమీ లేదని పుతిన్ చెబుతున్నప్పటికీ అది నాలుకపై నుంచి వచ్చిందా లేక హృదయపూర్వకంగా ఆయన అన్నారో ఇప్పటిైకెతే ఊహించలేము. 

ప్రచ్ఛన్నయుద్ధం తరువాత సోవియట్ యూనియన్ అంతరించిన తరుణంలో రష్యా పూర్తిగా చితికిపోయింది. పుతిన్ అధికార పగ్గాలు చేపట్టేవరకు రష్యాను అవెురికా ముప్పుతిప్పలు పెట్టింది. ఈ నేపథ్యంలో అధికారాన్ని చేపట్టిన పుతిన్ వినూత్న పోకడలతో రష్యాను మళ్లీ ప్రధాన స్రవంతిలోకి తీసుకురాగలిగారు. కడు దయనీయ స్థితిలో ఉన్న రష్యా ఆర్థిక స్థితిని చక్కదిద్దడంలోనూ, రష్యా చుట్టుపక్కల దేశాల్లో అవెురికా ఆధిపత్యాన్ని తిప్పికొట్టడంలోను పుతిన్ విజయం సాధించి రష్యా ప్రజల అభిమానానికి పాత్రులయ్యారు. రష్యన్లలో ఆత్మస్థైర్యాన్ని నింపడమే కాకుండా రష్యాను మళ్లీ సూపర్ పవర్‌గా తీర్చిదిద్దారు. ఈ ప్రయత్నాల్లో పుతిన్‌పై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిని లెక్కచేయకుండా రష్యాను మళ్లీపట్టాలెక్కించడంలో పుతిన్ వెనుదిరిగి చూడలేదు. ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చడం, దూకుడుగా, నిర్మొహమాటంగా మాట్లాడడం ఆయనకు కొన్ని చిక్కులు తెచ్చిపెట్టినా లక్ష్యపెట్టలేదు. ఈ చర్యలన్నీ ఒక్క రష్యాలోనే కాకుండా ప్రపంచంలోనే ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. 
ఆర్థికంగా కుదేైలెన దేశాన్ని కుదురుగా నిలపడంలో ఇంతవరకు ఆయన చేసిన కృషి అద్వితీయైవెునైదెనా భవిష్యత్తులో రష్యన్ల పరిస్థితుల్ని చక్కదిద్దగలిగిన నేతగా ఆయనను ఆ దేశ ప్రజలు అత్యంత విశ్వాసాన్ని చూపారు. ఈ క్రమంలో రష్యాను తీర్చిదిద్దడంలో పుతిన్‌పై అనేక ఆరోపణలు వచ్చివుండవచ్చు, కానీ ఆయన చర్యలన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయనపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించాయనే చెప్పుకోవాలి. ప్రపంచదేశాలు ఆయన మార్గాన్ని మొదట్లో తప్పు పట్టినా రషన్లు మాత్రం ఆయనకు నీరాజనాలు సమర్పించారు. అనంతర కాలంలో ఆయన దారిని ప్రశంసించడం భారత్ వంటి దేశాలకు తప్పలేదు. దాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యతగా పుతిన్ గుర్తించాలి. గత సెప్టెంబర్‌లో బ్రిక్స్ దేశాల సమావేశాల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన  చర్చలు జరపడం, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో మొట్టమొదటిసారిగా భారత్ పాల్గొనే అవకాశం కల్పించడం వెనుక పుతిన్ చేసిన కృషి మరువలేనిది. భారత్ అంటే తమకెంత ప్రాధాన్యం ఉన్న దేశమో ఆయన నిరూపించారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు అగమ్య గోచర దిశలో పయనిస్తున్న నేపథ్యంలో పుతిన్ నిర్వర్తించాల్సిన గురుతర బాధ్యత ఎంతో ఉంది. ఒక్క అంగుళం భూమిైనెనా వదులుకోమని, అందుకు అవసరైమెతే రక్తపాత యుద్ధానిైకెనా సిద్ధవేునని చైనా పొరుగుదేశాలను హెచ్చరిస్తున్న సమయంలో అంతర్జాతీయ రంగంలో శాంతిభద్రతలను కాపాడేందుకు, ఆసియా ఖండంలో యుద్ధవేుఘాలను తొలగించేందుకు రష్యాపై ఎంతో గురుతర బాధ్యత ఉంది. ప్రపంచ పోలీస్‌గా భావిస్తూ ప్రపంచదేశాలను తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని ఒకప్పటి అగ్రరాజ్యం అవెురికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న కుటిలయత్నాలను తిప్పికొట్టగల శక్తి ఒక్క రష్యాకే ఉందని గతానుభవాలు తెలుపుతున్నాయి. ఇందుకు ఆగ్నేయాసియా దేశాల సహకారంతో అవెురికాను నిలువరించే యత్నాలు చేపట్టే బాధ్యత కూడా పుతిన్ పైనే ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అస్తవ్యస్త పరిస్థితుల్ని సృష్టించడమే ధ్యేయంగా పెట్టుకుని కుట్రలకు పాల్పడుతున్న ట్రంప్‌ను దోషిగా నిలబెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు, అవెురికా రెచ్చగొడుతున్న ధోరణికి ముకుతాడు వేయాల్సిన సమయం ఇదే. ఇందుకు ఆగ్నేయాసియా దేశాల్లో సుస్థిర రాజకీయ పరిస్థితులేర్పడాలి. ఈదేశాల్లో ఒక్క పాకిస్థాన్ మినహా ఇతర దేశాల్లో పరిస్థితులు అదుపులోనే ఉంటున్నాయి. ఆగ్నేయాసియా దేశాల్లో ఏ దేశంలోైనెనా అస్థిర రాజకీయ పరిస్థితులేర్పడితే వాటిని ఉపయోగించుకోవడంలో అవెురికా ఉంటుందనేది నిస్సందేహం. ఇందుకు ఉదాహరణగా ఆఫ్ఘనిస్తాన్‌ను తీసుకోవచ్చు. పాకిస్థాన్‌లో టెర్రరిస్టుల ప్రభావంతో పాలకులు సతమతమవడాన్ని ట్రంప్ ప్రభుత్వం  ఆ దేశంపై పెత్తనం చేయడానికి, తాను గీసిన ‘లక్ష్మణరేఖ’ను ఉల్లంఘించకూడదని ఆంక్షలు పెడుతున్న విషయం తెలిసిందే.

అభివృద్ధి చెందుతున్న దేశాలతో 1950 దశకం నుంచి రష్యా (అప్పటి సోవియట్ యూనియన్) ఎంతో మెరుగైన వైుత్రీబంధాన్ని కొనసాగిస్తోంది. కశ్మీర్ వివాదైంపెగానీ, గోవాలో పోర్చుగీస్ అంశంలోగానీ అప్పటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు కృశ్చేవ్ 1955లో భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వైుత్రీబంధం బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా అవెురికా తన సప్తమవాహక నౌకాదళాన్ని బంగాళాఖాతంలో మోహరించినపుడు రష్యా అనుసరించిన వైఖరితో న్యూఢిల్లీ-మాస్కోల మధ్య మైత్రి మరింత విస్తరించింది. అప్పటినుంచి భారత్‌కు విశ్వాసపాత్రైమెన మిత్రుడుగా ఉంటున్న రష్యా భవిష్యత్తులో కూడా ఇదే మాదిరిగా వ్యవహరించే విషయంలో పుతిన్  చర్యలు చేపడతారని విశ్వసించవచ్చు. ఆగ్నేయాసియాలో యుద్ధవేుఘాలు చెదిరి శాంతిభద్రతలు ఏర్పడే దిశగా పుతిన్ చర్యలుంటాయని భావించవచ్చు.

English Title
Putin is back
Related News