ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన పీవీ సింధూ

Updated By ManamMon, 08/27/2018 - 12:47
pv sindhu

PVSindhu creates history, ensures first-ever silver in badminton

ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్ చేరిన తొలి భారత షట్లర్‌గా  పీవీ సింధు చరిత్ర సృష్టించింది. జకర్తాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో సింధు.. జపాన్‌కు చెందిన అకానీ యమగూచిపై 21-17, 15-21, 21-10 తేడాతో విజయం సాధించింది. ఇక  ఫైనల్స్‌లో వరల్డ్ నంబర్ వన్, టాప్ సీడ్ తై జు యింగ్‌తో సింధు తలపడనుంది. 

అలాగే హైదరాబాదీ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సోమవారం జరిగిన సింగిల్స్‌ సెమీ ఫైనల్స్‌లో  తై జు యింగ్‌ చేతిలో పరాజయం పొందింది. సింగిల్స్ మెడల్ గెలిచిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించినప్పటికీ... సెమీస్‌లో ఓటమి పాలవడంతో కాంస్యంతో సరిపెట్టుకుంది.

English Title
PVSindhu creates history, ensures first-ever silver in badminton
Related News